Vastu Tips: ఏ ఒక్కరికైనా ఈ ప్రపంచంలో హాయినిచ్చే ప్రదేశం ఇల్లు. రోజంతా ఎంతసేపు బయట తిరిగినా వెళ్లగానే చాలా రిలాక్స్‌గా అనిపిస్తుంది. ఇంట్లోకి అడుగుపెట్టగానే సగం అలసట మాయమవుతుంది. అయితే ఇంట్లోకి అడుగుపెట్టగానే విచిత్రమైన టెన్షన్ రావడం కొన్నిసార్లు జరుగుతుంది. ఇది ఎందుకు వాస్తు దోషమా? లేకపోతే మరేదైనా ఉండొచ్చా? ఆలోచించారా?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కొన్నిసార్లు ఇంట్లోకి రాగానే విపరీతమైన ఒత్తిడి ఫీలవుతారు. అదే బయట ఎంతసేపు సమయం గడిపినా ఇంట్లోకి రాగానే వింత ఒత్తిడిని అనుభవిస్తారు. మీకు కూడా అదే జరుగుతుంటే అది ఇంటి వాస్తు దోషాల వల్ల కావచ్చు. కాబట్టి, ఈరోజు వాస్తుశాస్త్ర నిపుణులు చెప్పిన దోషాల గురించి తెలుసుకుందాం. 



చీకటి..
ఇంటి ప్రవేశ ద్వారం వద్ద చీకటిగా ఉంటే ఇది ఇంట్లో ఒక రకమైన ప్రతికూలతను సృష్టిస్తుంది. ఇలా జరిగితే ఆ వ్యక్తికి ఇంట్లోకి రావాలని అనిపించదు. వెంటనే ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాలని అనిపిస్తుంది. ఇది ఒక విచిత్రమైన టెన్షన్‌. అంతేకాదు ఇంటి ప్రవేశ గోడలపై తడిగా లేదా గోడ పగుళ్లు ఏర్పడితే కూడా మంచిది కాదు.ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే టెన్షన్‌కు గురవుతారు.


మెట్లు..
ప్రవేశ ద్వారం ముందు ఇళ్లలో మెట్లు ఉంటాయి. తలుపు తెరిచిన వెంటనే ఒక వ్యక్తి కళ్ళు మొదట మెట్ల వైపుకు వెళ్తాయి. ఇది ఒక రకమైన ప్రతికూల శక్తిని కూడా సృష్టిస్తుంది . దీని వల్ల ఇంట్లోకి రాగానే టెన్షన్ ఫీలవుతారు. మీ విషయంలో కూడా ఇలాగే ఉంటే, మీరు ఆ అడ్డంకిని ముందుగా తొలగించుకోవాలి. తద్వారా ఇంట్లో నుంచి బయటకు రాగానే  దృష్టి పడదు.


Also read:  Guru Pushya Yoga 2024: ఈరోజు పుష్యపౌర్ణమి, గురుపుష్య యోగం.. ఇలా చేస్తే కటికదరిద్రుడైనా కుభేరయోగం..!


టాయిలెట్ డోర్..
కొన్ని ఇళ్ల ప్రవేశ ద్వారం ముందు టాయిలెట్ తలుపు ఉండే విధంగా నిర్మించబడ్డాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది కూడా మంచిది కాదు. దీని వల్ల మనిషి మనసులో ప్రతికూలత కూడా మొదలవుతుంది. మీ ఇంట్లో టాయిలెట్ డోర్ కూడా ఇదే పద్ధతిలో తయారు చేయబడితే, ఆ టాయిలెట్ తలుపు దిశను మార్చడానికి ప్రయత్నించండి.తద్వారా వచ్చే వ్యక్తికి టాయిలెట్ ప్రత్యక్ష వీక్షణ ఉండదు.


ఫర్నిచర్..
సాధారణంగా ఇళ్లలో ప్రవేశద్వారం వద్ద డ్రాయింగ్ గది ఉంటుంది. తమ సౌలభ్యం మేరకు డ్రాయింగ్ రూములను తయారు చేసుకుంటారు. అది సమస్య కాదు. కానీ ఆ డ్రాయింగ్ రూమ్‌లో చాలా పాత లేదా విరిగిన ఫర్నిచర్ ఉంచినట్లయితే అది అస్సలు మంచిది కాదు. దీని వల్ల ఇంట్లో నెగిటివిటీ పెరిగిపోయి మనుషుల్లో టెన్షన్ మొదలవుతుంది. 


Also read:  Name Astrology: 'S' అక్షరంతో పేరు మొదలయ్యేవారి వ్యక్తిత్వం ఎలాంటిది? వీళ్లు ఈ విషయంలో చాలా వీక్..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook