Dream Science: మీకు కలలో ఇవి కనిపిస్తే.. జీవితంలో జరిగేది అద్భుతమే.. మిమ్మల్ని ఆపేటోడే లేడు ఇంకా!
Dream Science In Telugu: చాలామంది నిద్రిస్తున్న సమయంలో వివిధ రకాల కలలు పడుతూ ఉంటాయి. అయితే వీటి గురించి డ్రీం సైన్స్ కొన్ని విషయాలను చెబుతోంది. నిజానికి డ్రీమ్ సైన్స్ ఏం చెబుతుందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Dream Science In Telugu: హిందూ సంప్రదాయంలో అనేక పురాతనమైన గ్రంథాలు ఉన్నాయి. అయితే ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్రంథాల్లో డ్రీమ్ సైన్స్ ఒకటి. ఇది కలలో వచ్చే అర్థాల గురించి చెబుతుంది. ఎవరు నిద్రించిన గల తప్పకుండా పడుతుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. చాలామంది అనేక రకాల కలలు కంటూ ఉంటారు. కొంతమంది అయితే రోజు వ్యక్తిగత జీవితంలో జరిగే కొన్ని కార్యకలాపాలకు సంబంధించిన కలలు కూడా కంటారు. అప్పుడప్పుడు కొంతమంది ఎప్పుడు ఊహించలేని విభిన్న కలలను కంటూ ఉంటారు. ఇలాంటి కొన్ని కలలే భవిష్యత్తులోని మంచి, చెడుల గురించి సూచిస్తాయని స్వప్న శాస్త్రం చెబుతోంది. స్వప్న శాస్త్రం ప్రకారం ఒక్కొక్క కళకు ఒక్కొక్క అర్థం ఉంటుంది. కొంతమందికి కలలు చెడు కనిపించినప్పటికీ శాస్త్రం ప్రకారం భవిష్యత్తులో మంచి జరుగుతుందట. అలాగే కొందరికి కలలో మంచి జరిగినప్పటికీ భవిష్యత్తులో మాత్రం అనేక దుష్ప్రభావాలకు దారితీస్తుందట. అయితే ఈరోజు స్వప్న శాస్త్రంలో పేర్కొన్న కొన్ని కీలక కలలకు సంబంధించిన వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
స్వప్న శాస్త్రం ప్రకారం కలలు వర్షం కనిపిస్తే ఏమవుతుందో తెలుసా? చాలామంది కలలో తడుస్తూ.. వర్షంలో గంతులు వేస్తూ కనిపిస్తూ ఉంటారు. ఇలా కలలు వర్షం పడడం గంతులు వేస్తూ కనిపించడానికి స్వప్న శాస్త్రం ఏం చెబుతుందో తెలుసా? ఇలా ప్రతిసారి కనిపిస్తే త్వరలోనే శుభవార్త వింటారని డ్రీమ్ సైన్స్ చెబుతోంది. నిజజీవితంలో ఊహించని శుభవార్తలు వినే ముందు ఇలాంటి కలలే వస్తాయని శాస్త్రంలో క్లుప్తంగా పేర్కొన్నారు. అంతేకాకుండా కలలో చంద్రుడిని చూడడం కూడా చాలా శుభప్రదంగా పరిగణిస్తారట. నిద్రిస్తున్న సమయంలో చంద్రుడు కనిపించడం, అలాగే ప్రకాశవంతమైన చంద్రుడు ఒక దశ నుంచి మరో దశకు వెళ్లడం.. ఇలా కలలు కనిపిస్తే త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయట. అంతేకాకుండా జీవితం కూడా సక్రమైన మార్గంలో నడుస్తుందట.
కొంతమందికి కలలో గోర్లు కత్తిరించడం కూడా కనిపిస్తూ ఉంటుంది. డ్రీం సైన్స్ ప్రకారం కలలో గోర్లు కత్తిరించడం కూడా చాలా శుభప్రదం అని కొంతమంది చెబుతున్నారు. కలలు ఇలా మీకు మీరే మీ గోర్లను కత్తిరించడం కనిపిస్తే.. త్వరలోనే అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా జీవితంలో ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని స్వప్న శాస్త్రంలో వెల్లడించారు. దీంతోపాటు గోర్లు కత్తిరించడం వల్ల డబ్బు కూడా క్రమంగా వస్తూ ఉంటుంది. నిద్రిస్తున్న సమయంలో పక్షుల ఎగురుతున్నట్లు కనిపించడం కూడా చాలా మంచిదిగా భావిస్తారు. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఇలా పక్షుల ఎగరడం కనిపించడం వల్ల జీవిత భాగస్వామితో ఉన్న గొడవలన్నీ పరిష్కారం అవుతాయట.
ఇదీ చదవండి: టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..
అలాగే కొంతమందికి తరచుగా నది కూడా కనిపిస్తూ ఉంటుంది. చక్కటి సెలయేర్లు, పచ్చని పంటలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా కలలో కనిపిస్తే త్వరలోనే ఊహించని శుభవార్తలు వింటారట. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా గతంలో కంటే చాలావరకు మెరుగుపడతాయట. అలాగే కలలో పండ్ల తోట కనిపించడం కూడా చాలా అదృష్టమట. స్వప్న శాస్త్రంలో ప్రతిరోజు కలలో పండ్ల తోట కనిపిస్తే ఆర్థిక పరిస్థితులు చాలావరకు మెరుగుపడతాయి. దీంతోపాటు అనేక ప్రయోజనాలు కలిగే ఛాన్స్ ఉందని డ్రీమ్స్ సైన్స్ చెబుతోంది.
ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.