Lord Krishna in Dream: మనం రోజూ ఎన్నో కలలు కంటూ ఉంటాం. ఇందులో కొన్ని మంచి, చెడూ రెండూ ఉంటాయి. అయితే మనకు వచ్చే డ్రీమ్స్ బట్టి ప్యూచర్ తెలుసుకోవచ్చని స్వప్న శాస్త్రం చెబుతోంది. డ్రీమ్స్ ఆస్ట్రాలజీ ప్రకారం, కలలో దేవతా విగ్రహాలను చూడటం శుభసూచకంగా భావిస్తారు. స్వప్న శాస్త్రం ప్రకారం, మీ కలలో శ్రీకృష్ణుడిని చూడటం శుభమో, అశుభమో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కలలో శ్రీకృష్ణుడు కనిపించడం
స్వప్న శాస్త్రం ప్రకారం, శ్రీకృష్ణుడిని (Lord Krishna) కలలో చూడటం చాలా శుభప్రదంగా భావిస్తారు. మీ కష్టాలన్నీ తొలగిపోయి మీరు మంచి సమయాన్ని గడుపుతారు. 


డ్రీమ్ లో రాధాకృష్ణులను కనిపించడం
కలలో రాధాకృష్ణులు కలిసి కనిపించడం చాలా శుభసూచికంగా భావిస్తారు. కలల శాస్త్రం ప్రకారం, మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. పెళ్లికానీ వ్యక్తికి ఈ కల వస్తే.. అతడు త్వరలోనే ప్రేమ వివాహం చేసుకుంటాడని అర్థం. వివాహితుడు కలలో కృష్ణుడు మరియు రాధ కలిసి చూడటం సానుకూల సంకేతం. త్వరలో మీరు కుటుంబ వివాదాలు, ఇంటి సమస్యల నుండి బయటపడతారు. ఓ వ్యాపారి ఈ డ్రీమ్ ను కంటే ఆ వ్యక్తి త్వరలోనే ధన లాభం పొందుతారు.


కలలో బాల గోపాలుడిని చూడటం
మీరు కలలో బాల గోపాలుడికి మీ ఒడిలో కూర్చొని ఆహారం పెడుతున్నట్లయితే దానిని శుభ సంకేతంగా పరిగణిస్తారు. మీరు శ్రీకృష్ణుని అనుగ్రహంతో పొందారని అర్థం. అంతేకాకుండా మీ కోరికలు త్వరలోనే నెరవేరుతాయి. మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. గర్భిణీ స్త్రీలు ఈ కలను కంటే మీకు త్వరలోనే కుమారుడు జన్మిస్తాడని అర్థం. 


Also Read: Mahalaxmi Rajyog; 2023లో అరుదైన 'మహాలక్ష్మి రాజయోగం'... ఈ 4 రాశులవారికి డబ్బే డబ్బు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.