Dreaming About Animals Meaning: స్వప్న శాస్త్రం అనేది కలల అర్థాన్ని విశ్లేషించే ఒక ప్రాచీన భారతీయ శాస్త్రం. మనం నిద్రిస్తున్నప్పుడు చూసే కలలు, మన మనసులోని ఆలోచనలు, భావోద్వేగాలు, అనుభవాల ప్రతిబింబాలుగా భావిస్తారు. ఈ శాస్త్రం ప్రకారం కలలు మన భవిష్యత్తు గురించి కొన్ని సూచనలు ఇస్తాయి. కలల ద్వారా మనస్సు రోజంతా సంపాదించిన అనవసరమైన ఆలోచనలను, భావోద్వేగాలను విడుదల చేస్తుంది. కొందరు కలలు భవిష్యత్తు సంఘటనలకు సంకేతాలుగా భావిస్తారు. అయితే కొన్ని సార్లు కలలో కొన్ని రకాల జంతువులు కనిపిస్తుంటాయి. అందులో తెల్లని జంతువులు కూడా కనిపిస్తాయి. దీని అర్థం ఏంటో మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్వప్న శాస్త్రం ప్రకారం కలలో కనిపించే తెల్లని జంతువులు చాలా శుభ సూచకంగా భావిస్తారు. ప్రతి జంతువుకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. తెల్లని రంగు శుద్ధి, నిర్మలతకు ప్రతీక. కలలో తెల్లని జంతువులు కనిపిస్తే, అది మన మనసు శుద్ధిగా ఉందని, ఆధ్యాత్మికంగా ఎదగుతున్నామని సూచిస్తుంది. తెల్లని జంతువులు అదృష్టానికి సంకేతంగా భావిస్తారు. వీటిని కలలో చూడటం అంటే మన జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. తెల్లని జంతువులు మన జీవితంలో కొత్త మార్పులు, కొత్త అవకాశాలు వస్తున్నాయని సూచిస్తాయి.


స్వప్న శాస్త్రం ముఖ్యమైన తెల్లని జంతువులు వాటి అర్థాలు:


తెల్ల గుర్రం: తెల్ల గుర్రం విజయం, విజయవంతమైన కెరీర్, సానుకూల మార్పులు, వేగవంతమైన అభివృద్ధిని సూచిస్తుంది.


తెల్ల కుందేలు: తెల్ల కుందేలు శ్రేయస్సు, సంతానం, కొత్త ప్రారంభాలు అదృష్టాన్ని సూచిస్తుంది.


తెల్ల ఏనుగు: తెల్ల ఏనుగు శక్తి, బలం, స్థిరత్వం, ఆర్థిక లాభాలను సూచిస్తుంది.


తెల్ల పాము: తెల్ల పాము జ్ఞానం, మార్పు, పునర్జన్మ, ఆధ్యాత్మిక అభివృద్ధిని సూచిస్తుంది.


తెల్ల కుక్క: తెల్ల కుక్క స్నేహం, నమ్మకం, రక్షణని సూచిస్తుంది.


కేవలం జంతువులు మాత్రమే కాకుండా కలలో తెల్లని నెమలి, శివలింగం కనిపించిన ఎంతో మంచి సూచన అని అర్థం.  శివుడు అనుగ్రహం యొక్క ప్రతీక. తెల్లని శివలింగం కలలో కనిపించడం శివుని అనుగ్రహం మీపై ఉందని సూచిస్తుంది. శివుడు జ్ఞానం, విజయానికి అధిదేవత. కనుక తెల్లని శివలింగం కలలో కనిపించడం మీరు జీవితంలో పెద్ద విజయం సాధించబోతున్నారని సూచిస్తుంది.  తెల్లని నెమలి అరుదుగా కనిపించే జంతువు. కనుక కలలో తెల్లని నెమలి కనిపించడం అదృష్టం, సంకేతంగా భావిస్తారు. తెల్లని నెమలి కలలో కనిపించడం త్వరలోనే పెద్ద విజయం సాధించబోతున్నారని సూచిస్తుంది.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.