Dreams Meaning: జ్యోతిష్యశాస్త్రంలో స్వప్నశాస్త్రం ప్రత్యేకంగా ఉంటుంది. కలలు వాటి అర్ధాలు, సంకేతాల గురించి తెలిపేదే ఈ శాస్త్రం. మీకు కలలో వచ్చే అంశాల్ని బట్టి అది శుభసూచకమా లేదా అనేది ఉంటుంది. ఏ కలలు దేనికి సంకేతాలో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం స్వప్నాలకు ప్రత్యేక అర్ధాలు, సంకేతాలు ఉంటాయి. రాత్రివేళ కన్పించే కలలకు జ్యోతిష్యం ప్రకారం విశేష మహత్యముంటుంది. స్వప్నశాస్త్రం ప్రకారం కొన్ని కలలు శుభసంకేతమైతే..మరికొన్ని అశుభానికి చిహ్నాలు. సాధారణంగా మనందరికీ వివిధ రకాల కలలు వస్తుంటాయి. అయితే ప్రతి కలకు ఏదో ఒక అర్ధముంటుందంటున్నారు జ్యోతిష్య పండితులు. స్వప్నశాస్త్రంలో నిద్రలో కధల వెనుక ఎన్నో రహస్యాలున్నాయి. కలలో కన్పించే ప్రతి దానికీ ఏదో ఒక సంబంధం ఉంటుంది. ఆ వివరాలు ఇప్పుడు మీ కోసం..


కలలో ఈ 6 అంశాలు కన్పిస్తే..


మీకు కలలో పాము మీవైపుకు వస్తూ కన్పిస్తే..మీ శత్రువు మీ దగ్గరకు వస్తున్నాడని అర్ధం. ఆ శత్రువులు మీకు అత్యంత ప్రమాదకారులు కూడా అవుతారు. అందుకే కలల్లో పాములు కన్పిస్తే అప్రమత్తంగా ఉండాలి. ఇక కలలో పెళ్లికూతురు కన్పిస్తే..మీ ప్రత్యర్ధితో మీకు రాజీ కానుందని అర్ధం. అంటే పరస్పరం రాజీ కుదుర్చుకుంటారు. ఒకవేళ కలలో మీకు క్యాక్టస్ మొక్క కన్పిస్తే..ఇది చాలా అశుభ సంకేతం. అంటే మీ జీవితంలో సమస్యలు ఎదురు కానున్నాయని అర్ధం. ఆనందంగా, సంతోషంగా ఉన్న మీ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. కుటుంబసభ్యుల్లో కలహాలు పెరుగుతాయి. దాంపత్య జీవితం పాడవుతుంది. 


ఒకవేళ మీకు కలలో ఆరిపోయిన దీపం కన్పిస్తే..అది కూడా అశుభ సంకేతమే. అంటే మీ జీవితంలో ఎగుడుదిగుడు రానుందని అర్ధం. జీవితంలో సమస్యలు రేగవచ్చు. కష్టాలొచ్చినప్పుడు మీరు ఒంటరిగా మారుతారు. సాధారణంగా కలల్లో కింద పడిపోతున్నట్టు కన్పిస్తుంటుంది. ఇది సాధారణమే కానీ..కొండపై నుంచి పడుతున్నట్టుగా కలలో కన్పిస్తే..మీ జీవితంలో డౌన్‌ఫాల్ ప్రారంభమైనట్టే అర్ధం. మీ కీర్తి ప్రతిష్ఠలకు భంగం కలగనుందని అర్ధం. గౌరవ మర్యాదల్లో లోపం రావచ్చు. ఇటువంటి కలలు జీవితంలో దుష్ప్రభావం చూపిస్తాయి.


కొన్నిసార్లు మరణించిన వ్యక్తులు కలలో వస్తుంటారు. దీనికి వివిధ కారణాలుంటాయి. ఇలాంటి కలలు దుఖం లేదా పశ్చాత్తాప భావనలకు ప్రతిరూపంగా భావించవచ్చు. కొంతమంది అకాల మరణం చెందుతుంటారు. ఆ సమయంలో చాలా కోర్కెలు నెరవేరకుండా మిగిలిపోతుంటాయి. మీకు కలలో కన్పించారంటే మీ నుంచి ఏదో సహాయం ఆశిస్తున్నారని అర్ధం


Also read: Sravana masam 2022: శ్రావణమాసం తొలి సోమవారం రేపే, పూజా సమయం, తేదీ, ముహూర్తం ఎప్పుడంటే, ప్రదోష వ్రతం కూడా



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook