COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2024 Rasi Phalalu Telugu:  ఈరోజు ఎంతో ప్రాముఖ్యత కలిగిన గురు పుష్య యోగం ఏర్పడబోతోంది. యోగం చంద్రగ్రహం మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేయడం కారణంగా ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈరోజు ఎంతో కీలకమైన రోజుగా భావించవచ్చు ఎందుకంటే గురు పుష్యమియోగంతో పాటు అమృత సిద్ది యోగం, సర్వసిద్ధి యోగం ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా ఐదు రాశుల వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. ఈరోజు ఏర్పడే ప్రత్యేక యోగాలు ఎంతో శక్తివంతమైనవి. అంతేకాకుండా ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. దీని కారణంగా చాలా రకాల లాభాలు పంపుతారు.


వృషభ రాశి:
వృషభ రాశి వారు పుష్యమి యోగం కారణంగా కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా మతపరమైన కార్యక్రమాలు నిమగ్నమవుతారు. దీంతోపాటు వీరి అదృష్టం పెరిగి గొప్ప అవకాశాలు పొందుతారు. ఇక వ్యాపారాలు చేస్తున్నవారు కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తారు. వైవాహిక జీవితం వృషభ రాశి వారికి చాలా ప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో భాగస్వామితో ఎంతో ప్రేమతో ఉంటారు కుటుంబ సభ్యుల మద్దతు కూడా లభించి, కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా విదేశాల్లో నివసిస్తున్న వారు బంధువుల నుంచి శుభవార్త వింటారు. రాబోయే కొత్త సంవత్సరంలో ఈ యోగం కారణంగా విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.


సింహరాశి:
ఈ ప్రత్యేక యోగం కారణంగా సింహ రాశి వారికి డిసెంబర్ 28వ తేదీ నుంచి శుభ ఘడియలు ప్రారంభం కాబోతున్నాయి. సర్వార్ధ సిద్దయోగం కారణంగా ఈ రాశి వారు ఎంతో సంతోషకరమైన రోజులను పొందుతారు. అంతేకాకుండా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొని మానసిక ప్రశాంతతను పొందుతారు. ఇక ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్లాలనుకునే వారు ఈ సమయంలో వెళ్లగలుగుతారు. కోర్టు చిక్కులతో బాధపడుతున్న వారికి ఈ అహం కారణంగా కొంత ఉపశమనం లభిస్తుంది. ఇక వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేసేవారు మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా డబ్బు సంపాదిస్తారు. వృత్తిపరంగా ఈ రాశి వారికి ఈ ప్రత్యేక యోగ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. గతం నుంచి కొనసాగుతూ వస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. వీరికి శ్రీమహావిష్ణువు అనుగ్రహం వల్ల కుటుంబ జీవితంలో ఆనందం శాంతి సంతోషాలు నెలకొంటాయి.


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


వృశ్చిక రాశి:
ఈ ప్రత్యేక యోగాలు వృశ్చిక రాశిపై కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపబోతున్నాయి. దీనికి కారణంగా వృశ్చిక రాశి వారికి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమయంలో మీరు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ సమయం ఆర్థిక పురోగతికి ప్రత్యేకంగా మారబోతోంది. సమాజ సేవ చేస్తున్న వారు ఈ సమయంలో గొప్ప ప్రశంసలు పొందుతారు. దీంతో పాటు వృశ్చిక రాశి వారు ఈ సమయంలో కొత్త సొంత వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అదృష్టం పెరగడం కారణంగా ఇలాంటి పనులు చేసిన అఖండ విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా పుణ్యక్షేత్రాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.


ధనస్సు రాశి:
ప్రత్యేక యోగాల ప్రభావం ధనస్సు రాశి వారిపై కూడా పడబోతోంది. దీని కారణంగా ఈ రాశి వారికి చాలా లాభదాయకంగా ఉండబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రాశి వారికి శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభించి జ్ఞానం రెట్టింపు అవుతుంది. వ్యాపారాల్లో కూడా చురుగ్గా పాల్గొని ఊహించని లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంతేకాకుండా ఈ సమయంలో వీరు కొత్త కారు లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక విదేశాల్లో చదవాలనుకునే కోరిక ఈ యోగం వల్ల నెరవేరబోతోంది. కుటుంబ సభ్యులతో కలిసి ఈ సమయంలో విహారయాత్రలకు కూడా వెళ్తారు..ముఖ్యంగా పిల్లల నుంచి గొప్ప శుభవార్తను కూడా వింటారు.


Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter