Budh Gochar 2024 In Telugu: మే నెలలో బృహస్పతి సంచారం తర్వాత త్వరలోనే బుధ గ్రహం కూడా సంచారం చేయబోతోంది. ఈ గ్రహ సంచారం మే 31వ తేదిన జరగబోతోంది. ఈ రోజు బుధుడు మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించబోతోంది. అయితే ఇదే సమయంలో శుక్రుడితో పాటు సూర్య గ్రహాల కలయిక జరబోతోంది. ఈ గ్రహాల కలయిక, బుధుడు మేషరాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో జూన్‌ 15 వరకు కొన్ని రాశులువారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఎక్కువగా లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి:
మేష రాశివారికి బుధుడి సంచారంతో వృత్తి పరమైన జీవితంలో అనేక మార్పలు వస్తాయి. దీంతో పాటు కొన్ని సమస్యలు ఎదుర్కొనే ఛాన్స్‌ కూడా ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు వీరి ఏకాగ్రత కూడా దెబ్బతింటుంది. అలాగే పనుల్లో కొన్ని సమస్యలు కూడా వస్తాయి. వ్యాపారాలు చేస్తున్నవారు కొన్ని నష్టాలను కూడా ఎదుర్కొనే ఛాన్స్‌ ఉంది. కుటుంబ విషయాల్లో కూడా ఎన్నో మార్పులు వస్తాయి. అలాగే విపరీతమైన సమస్యల కారణంగా ఒత్తిడి కూడా పెరిగే ఛాన్స్‌ ఉంది. ఈ సమయంలో తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా నరాల బలహానత వంటి సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. 


వృషభ రాశి:
ఈ సమయంలో వృషభ రాశివారి పరిస్థితి కూడా అచ్చం మేష రాశి వారి లాగే ఉంటుంది. వృత్తి పరమైన జీవితంలో లాభాలు పొందాలనుకునేవారు తప్పకుండా ఎక్కువ సమయం పాటు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో అనేక అడ్డంకు కూడా దారి తీయోచ్చని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వ్యాపారాలు చేస్తున్న కొంతమంది విజయాలు సాధించే ఛాన్స్‌ కూడా ఉంది. అలాగే ఈ సమయంలో కొన్ని సవాళ్లు ఎదురయినప్పటికీ కుటుంబ జీవితం మాత్రం చాలా బాగుటుంది. అంతేకాకుండా భాగస్వామితో ఈ సమయంలో మధురమైన క్షణాలు గడుపుతారు. అయితే ఈ సమయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


మిథున రాశి:
మిథున రాశివారికి కూడా ఈ సమయంలో అన్ని పనుల్లో ఆసంతృప్తిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు వ్యాపారాల్లో వస్తున్న సమస్యలకు కొంత విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఖర్చులు కూడా గణనీయంగా పెరుగుతాయి. కాబట్టి ఆర్థిక పరమైన విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దీంతో పాటు చికాకు వంటి సమస్యలకు లోనయ్యే ఛాన్స్‌ ఉంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి