Dhan Shakti Rajyog 2024: జాతకంలో గ్రహ స్థానాలు నిరంతరం మారుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రతి గ్రహం ఏదో ఒక సమయంలో గ్రహ సంచారం చేస్తుంది. దీని కారణంగా గ్రహ స్థానాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. అయితే ఈ మార్పులు కారణంగా వ్యక్తిగత జీవితంపై కూడా ప్రత్యేక ప్రభావం పడుతుంది. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన శని, కుజ, కేతు, సూర్య గ్రహాలు సంచారం చేస్తే అన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ 2024 సంవత్సరంలో జరిగే గ్రహ సంచారాల కారణంగా కొన్ని రాశులవారికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులు పొందుతారు. అంతేకాకుండా ఈ ఏడాది వచ్చిన  వసంత పంచమి నుంచి కొన్ని రాశులవారికి పూర్తిగా జీవితం మారబోతోంది. దీంతో పాటు ఈ సమయంలో అశ్వినీ నక్షత్రం ఇతర నక్షత్రాలతో కలవడం కారణంగా ఉద్యోగాల్లో మార్పులు వస్తాయి. దీంతో ఈ కింది రాశులవారికి ఆకస్మిక లాభాలతో పాటు ఉద్యోగాల్లో మార్పులు వస్తాయి. అంతేకాకుండా ఈ సమయంలో కొన్ని ప్రత్యేక యోగాలు కూడా ఏర్పడ్డాయి.


మేష రాశి:
మేషరాశి అశ్వినీ నక్షత్రం ఇతర నక్షత్రంలో కలవడం వల్ల కెరీర్‌ పరంగా ఊహించని మార్పులు వస్తాయి. దీంతో పాటు పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తులు కూడా పొందుతారు.. అంతేకాకుండా చిరకాలంగా వస్తున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. దీంతో పాటు ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే కుటుంబంలో కూడా ప్రశాంతవంతమై వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. 


కన్యా రాశి:
కన్య రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అలాగే ఆకస్మిక ధన లాభాలు కూడా పొందుతారు. మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. ఉద్యోగాలు చేస్తున్నవారు కార్యాలయాల్లో ప్రశంసలు పొందుతారు. 


Also read: AP Capital Issue: ఏపీ రాజధానిపై నిర్ణయం కేంద్రానిదే, మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు


మకర రాశి:
మకర రాశి వారు ఈ సమయం చాలా లాభసాటిగా ఉంటుంది. వ్యాపారాలు చేసేవారికి పురోగతి లభిస్తుంది. అంతేకాకుండా కష్టమైన పనుల్లో కూడా విజయాలు పొందుతారు. దీంతో పాటు కుటుంబ సభ్యులతో ఆనందంగా సమాయాన్ని గడుపుతారు. అలాగే వీరు ఈ సమయంలో కొత్త కార్లు లేదా ఇండ్లు కొనుగోలు చేసే ఛాన్స్‌ కూడా ఉంది. అంతేకాకుండా ఈ సమయంలో కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. 


Also read: AP Capital Issue: ఏపీ రాజధానిపై నిర్ణయం కేంద్రానిదే, మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి