Mars-Venus Conjuction February 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు నిర్దిష్ట సమయంలో రాశి సంచారం చేస్తూ ఉంటాయి. గ్రహాల గమనం మారడం కారణంగా అనేక శుభయోగాలు రాజయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. దీని ప్రభావం మొత్తం 12 రాశుల వారిపై చూపుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు అధిపతిగా వ్యవహరించే కుజుడు ఫిబ్రవరి 5వ తేదీన మకర రాశిలోకి సంచారం చేశాడు. ధన సంతోషాలకు కారకుడైన శుక్రుడు 2024 ఫిబ్రవరి 12వ తేదీన ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ శుక్ర గ్రహం మార్చి 7వ తేదీ వరకు అదే రాశిలో సంచార దశలో కొనసాగుతూ ఉంటుంది. అయితే ఫిబ్రవరి 12వ తేదీన మకర రాశిలో శుక్రుడు, కుజుడి కలయిక జరగబోతోంది. దీని కారణంగా మేష రాశితో పాటు మరికొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి:
మేష రాశి వారికి ఈ రెండు గ్రహాలు కలయిక కారణంగా ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి లభించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం చాలా శుభ్రంగా ఉంటుంది. దీంతో పాటు వీరు కొత్త జాబ్ ఆఫర్స్ పొందుతారు. అంతేకాకుండా కొత్త ఆదాయ వనరుల ద్వారా ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు. అలాగే జీవితంలో చాలా పెద్ద మార్పులు వచ్చి కుటుంబంలో సంతోషకరమైన రోజులు ప్రారంభం అవుతాయి. దీంతో పాటు మేష రాశి వారికి మనసులో ఆనందం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సక్సెస్ అవుతారు.


వృషభ రాశి:
వృషభ రాశి వారికి కూడా ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా ఏర్పడే ప్రభావం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో శ్రమకు తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. దీంతోపాటు కెరీర్‌లో కొత్త విజయాలు కూడా సాధిస్తారు. ఇంతకుముందు ఉన్న ఆర్థిక పరిస్థితుల కంటే.. ఈ సమయంలో మరింత మెరుగుపడతాయి. అంతేకాకుండా ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం కూడా చాలావరకు మెరుగుపడుతుంది. ఇంతకుముందు వ్యాపారాల్లో వచ్చిన అడ్డంకులన్నీ తొలగిపోతాయి.


Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..
తులారాశి:
తులా రాశి వారికి శుక్ర, కుజ గ్రహాల కలయిక కారణంగా అనుకోని ఆదాయం గురించి ఊహించని లాభాలు పొందుతారు. దీంతోపాటు కొన్ని శుభవార్తలను అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయం చాలా శుభ్రంగా ఉంటుంది. దీంతోపాటు మీరు చేస్తున్న పనులను అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇక వైవాహిక జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం చాలా ప్రత్యేకంగా ఉంటుంది.


వృశ్చిక రాశి:
ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా వృశ్చిక రాశి వారికి కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు ఆర్థికంగా ఎంతో లాభపడతారు. దీంతోపాటు కొత్త జాబ్ ఆఫర్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. అంతేగాకుండా వృత్తి జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం లాభాలు కలిగించే విధంగా ఉంటుంది. దీంతోపాటు జీవిత భాగస్వామి నుండి సపోర్ట్ లభిస్తుంది.


Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter