COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mercury Transit 2023: ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధ గ్రహం నవంబర్ 27వ తేదీన వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి సంచారం చేయబోతోంది. జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ గ్రహం సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బుధుడు ధనస్సు రాశిలోకి సంచారం చేయడం కారణంగా కొన్ని రాశులకు శుభప్రదంగా ఉంటే మరి కొన్ని రాశుల వారికి తీవ్ర దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శుభ ఫలితాలు ఇచ్చే బుధ గ్రహం సంచారం చేయడం కారణంగా ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


బుధ గ్రహ సంచారం కారణంగా నవంబర్ 27వ తేదీ నుంచి వృషభ రాశి వారు ఆస్తులతో పాటు వ్యాపారాలపరంగా మంచి లాభాలు పొందబోతున్నారు. ఈ సంచార సమయంలో ఇలాంటి పనులు చేసిన విజయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా బుధ గ్రహ సంచారం కారణంగా మీ భాగస్వామి నుంచి కూడా అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. ఎప్పటినుంచో వస్తున్న కుటుంబ సమస్యలు కూడా ఈ సమయంలో పరిష్కారమవుతాయి. ముఖ్యంగా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారు ఈ సమయంలో తప్పకుండా శుభవార్తలు వింటారు.


Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ  


సింహ రాశి వారికి కూడా బుధ గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఈ సమయంలో సింహ రాశి వారికి బుధుడి అనుగ్రహం లభించి అదృష్టం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా పెండింగ్లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. ఇక భవిష్యత్తు కోసం కొత్త ప్రణాళికలు రూపొందించాలనుకునే వారికి ఇది సరైన సమయంగా చెప్పవచ్చు. ఈ సమయంలో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా ఊహించని లాభాలు పొందుతారు.


కన్యా రాశి వారికి బుధ గ్రహ సంచారం ఎంతో కీలకంగా మారబోతోంది. ఈ రాశి వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న మంచి లాభాలు పొందుతారు అంతేకాకుండా పెండింగ్లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. ఇక అప్పుల బాధలతో ఉన్నవారికి ఈ సమయంలో గొప్ప ఉపశమనం లభిస్తుంది ఆర్థికంగా కూడా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేసేవారు కార్యాలయాల్లో ఊహించని లాభాలు పొందుతారు. కాకుండా వీరు కుటుంబంతో కలిసి ఎక్కడికైనా ట్రిప్పులకు వెళ్లే ఛాన్సులు కూడా ఉన్నాయి.


Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook