COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Shukra Rashi Parivartan 2023 October: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం సంచారం చేస్తుంది. ఈ సంచార ప్రభావం మానవ జీవితాలపై పడుతుంది. అక్టోబర్ మొదటి వారంలో చాలా గ్రహాలు తమ రాశిని వదిలి ఇతర రాశిలోకి సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన  శుక్రగ్రహం కూడా  ఈ మొదటి వారంలోనే సంచారం చేయబోతోంది. అక్టోబర్ 2వ తేదీ తెల్లవారుజామున 1:02 గంటలకు శుక్రుడు సింహరాశిలోకి సంచారం చేయనుంది. ఆ తర్వాత ఈ గ్రహం నవంబర్‌ నెలలో సింహ రాశి నుంచి కన్యా రాశిలోకి సంచారం చేయనుంది. అయితే ఈ సంచారం కారణంగా ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడబోతోందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.  


ఈ రాశులవారిపై ప్రత్యేక ప్రభావం:
కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి శుక్రుడు కన్యారాశిలోకి సంచారం చేయడం వల్ల గోల్డెన్‌ డేస్ ప్రారంభం కాబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరికి ఊహించని లాభాలు కలిగి ప్రమోషన్స్‌ లభించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వీరి ఆదాయం కూడా ఈ సమయంలో రెట్టింపు అవుతుంది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి ఈ సమయంలో మంచి కంపెనీల్లో లభిస్తాయి. అంతేకాకుండా డబ్బు సంపాదించేందుకు కొత్త మార్గాలు కూడా తెరుచుకుంటాయి. ఈ సమయంలో డబ్బులను పొదుపు చేయడం వల్ల భవిష్యత్‌లో ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో మీ పిల్లల నుంచి కూడా శుభవార్తాలు వింటారు. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


కన్య రాశి:
శుక్రుని సంచారం కారణంగా కన్యా రాశి వారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరు ఈ సమయంలో ఏ రంగంలో పనులు చేసిన సులభంగా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు వీరికి అదృష్టం అనుకూలంగా మారి అన్ని రకాల పనుల్లో విజయాలు సాధిస్తారు. ఈ సమయంలో జీవితం సంతోషంగా మారుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్‌లో కొత్త విజయాలు సాధిస్తారు. 


వృశ్చిక రాశి: 
వృశ్చిక రాశి వారికి శుక్రుని సంచారంతో ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కొత్త ఆదాయ మార్గాలు కూడా ఈ సమయంలో ఏర్పడతాయి. దీంతో పాటు వీరికి ప్రయాణాలు చేయడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి ఈ సమయంలో గొప్ప ఉపశమనం లభిస్తుంది. కెరీర్‌లో కొత్త అవకాశాల కోసం చూస్తున్నవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి