COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Maha Daridra Yoga: ఒక గ్రహం సంచారం చేసినప్పుడు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. అన్ని రాశులవారిపై ప్రభావం పడుతుంది. గ్రహ సంచారాన్ని బట్టి రాశులపై మంచి చెడు ప్రభావాలు పడతాయి. గ్రహాల రాజుగా వ్యవహరించే సూర్యుడు కర్కాటక రాశిలోకి సంచారం చేసిన సంగతి అందరికీ తెలిసిందే..ఆగస్టు 17 వరకు సూర్యుడు అక్కడే ఉంటాడు. ఆ తర్వాత సూర్యుడు ఇతర రాశిలోకి సంచారం చేస్తాడు. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో ఏయే రాశులవారు ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..



ఈ రాశులవారిపై సూర్య గ్రహం ప్రభావం:
మిథున రాశి:

మిథునరాశిలో పుట్టిన వారికి ఈ క్రమంలో చాలా రకాల కష్టాలు, నష్టాలు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇతరులతో మాట్లాడే క్రమంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే వివాదాలకు దారి తీసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇక వ్యాపారాలు చేసేవారు తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర ఆర్థిక సమస్యలు కూడా రావచ్చు.


Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృత


కన్య రాశి:


కన్య రాశి వారికి ఈ క్రమంలో తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ఈ క్రమంలో తీవ్ర సమస్యలు ఎదుర్కోనే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ సంచారం చివరిలో కష్టపడి పనులు చేయడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాల వల్ల తీవ్ర ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టేవారు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా కుటుంబంలో కూడా తీవ్ర సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి ఓర్పుతో ఉండడం చాలా మంచిది. 


ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారు ఈ సమయంలో అనేక సవాళ్లను ఎదుర్కోంటారు. వృత్తి జీవితాన్ని గడుపుతున్నవారికి వృత్తిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. దీని కారణంగా ఆర్థి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వైవాహిక జీవితం గడుపుడుతున్న వారిపై కూడా తీవ్ర దుష్ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నార. ఇక వ్యాపారాలు చేసేవారు ఆర్థికంగా కూడా చాలా నష్టపోతారు. దీంతో పాటు అనారోగ్య సమస్యల బారిన కూడా పడతారు. కాబట్టి ఈ క్రమలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. 


Also Read: Gaddar Cremation:గద్దర్ అంత్యక్రియల్లో అపశృతి.. తొక్కిసలాటలో సీనియర్ జర్నలిస్ట్ మృత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి