Sun Transit 2023: రేపటి నుంచి ఈ రాశులవారి జీవితాల్లో భారీ మార్పులు..లాభాలే లాభాలు!
Sun Transit 2023: డిసెంబర్ 16న సూర్యగ్రహం సంచారం చేయడం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
Sun Transit 2023: డిసెంబర్ 16న సూర్యగ్రహం సంచారం చేయబోతోంది. సూర్యుడు వృశ్చికరాశి నుంచి ధనుస్సు రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. జనవరి 14వ తేది వరకు సూర్యుడు అదే రాశిలో సంచార దిశలోనే ఉంటాడు. సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంది. అందుకే ఈ గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు రాజుగా పిలుస్తారు. అయితే సూర్యుడు ధనుస్సు రాశిలోకి సంచారం చేయడం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలు కలిగే ఛాన్స్ ఉంటుంది. డిసెంబర్ 16 నుంచి ఏయే రాశుల వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మేష రాశి:
సూర్యగ్రహం సంచారం కారణంగా మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. అంతేకాకుండా తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభించి మంచి లాభాలు పొందుతారు. వ్యాపారాల్లో కూడా లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
వృషభ రాశి:
ధనుస్సు రాశి వారికి సూర్య గ్రహం ధనుస్సు రాశిలోకి సంచారం చేయడం చాలా శుభప్రదమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. చదువుపై ఆసక్తి కూడా పెరుగుతుంది. ఈ సమయంలో బట్టలు కూడా బహుమతులు కూడా పొందుతారు. వ్యాపారాల్లో లాభాలు కూడా పొందుతారు.
మిథున రాశి:
సూర్యుడు ధనుస్సు రాశిలోకి సంచారం చేయడం వల్ల మిథునరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. దీంతో పాటు సమాజంలో గౌరవం కూడా పొందుతారు. స్నేహితులతో కలిసి వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి సూర్య గ్రహ సంచారం సాధారణంగానే ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు మనసులో హెచ్చు తగ్గులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమయంలో కుటుంబం నుంచి సపోర్ట్ కూడా లభిస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి అధికారుల నుంచి సపోర్ట్ కూడా లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి