Earth signs On these 3 zodiac signs Shani Dev always shower the blessings: జ్యోతిషశాస్త్రం ప్రకారం.. రాశిచక్రాలపై అగ్ని, భూమి, నీరు, వాయువుల ఆధీనంలో ఉంటాయి. మేషం, సింహం, ధనుస్సు రాశులు అగ్ని ఆధీనంలో ఉంటాయి. వృషభం, కన్య, మకరం భూమి ఆధ్వర్యంలోకి వస్తాయి. కర్కాటకం, వృశ్చికం, మీనం రాశులు జల ఆధీనంలో ఉంటాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక భూమి (earth) ఆధీనంలో ఉండే రాశుల విషయానికి వస్తే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ రాశులకు కాస్త ప్రత్యేకత ఉంటుంది. భూమి ఆధీనంలో ఉండే వృషభం, కన్య, మకరం రాశుల వారికి శని దేవుడి ఆశీస్సులు ఉంటాయి. ఈ మూడు రాశులు సులభంగా ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు వాళ్లు పట్టుకుందంతా బంగారమే అవుతుంది. ఈ మూడు రాశులపై శని (Shani) ప్రభావం చాలా అనుకూలంగా ఉంటుంది. 


వృషభం (Taurus)


వృషభ రాశికి అధిపతి శుక్రుడు. అలాగే ఈ రాశి వారికి చంద్రుడి బలం కూడా ఉంటుంది. అంతే కాకుండా ఈ రాశి వారిపై బుధగ్రహ ప్రభావం ఉంటుంది. శుక్రుడు, బుధుడు ప్రభావంతో ఈ వృషభ రాశివారు ఎంతో ధైర్యవంతులుగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తుంటారు. డబ్బు విషయంలో కూడా ఇతరుల కంటే ముందుంటారు.


కన్య (Virgo)


కన్య రాశికి అధిపతి బుధుడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. భూమి ఆధీనంలో ఉండే అత్యంత ప్రధాన రాశి ఇది. ఈ రాశుల వారిపై బుధగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ రాశివారిలో చాకచక్యం, వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ రాశి వారు ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉంటారు. కన్యా రాశి వారు డైమండ్స్‌ ధరిస్తే వారి జీవితంలో ఇంకా విజయవంతంగా ముందుకెళ్లవచ్చు. 


Also Read : Horoscope Today: నేడు శుక్రవారం- ఈ రాశుల వారికి గడ్డుకాలం నడుస్తోంది జాగ్రత్త..


మకరరాశి (Capricorn)


మకర రాశికి శని (Saturn) దేవుడు అధిపతి. అలాగే ఈ రాశిపై బుధుడు ప్రభావం చాలా బలంగా ఉంటుంది. దీంతో మకరరాశి వారు చాలా తెలివివంతులుగా ఉంటారు. ఈ రాశికి చెందిన వ్యక్తులు అవకాశవాదులుగా ఉంటారు. అలాగే మోసపూరిత చర్యలకు పాల్పడుతుంటారు. అయితే మకర రాశి వారు కొన్ని విషయాల్లో నిష్ణాతులుగా ఉంటారు. ఈ రాశి వారు సూర్యభగవానుడిని (Sun) రోజూ పూజించడం మేలు.
Also Read : Importance of Friday: శుక్రవారం .. లక్ష్మిపూజ ఇలా చేస్తే ఇంట్లో డబ్బే డబ్బు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook