రంజాన్ పండుగ వచ్చేస్తోంది. రంజాన్ నెలలో ఏం చేయాలి, పండుగ ఎలా జరుపుకుంటారు, చంద్రుడితో ఉన్న సంబంధమేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈదుల్ ఫిత్ర్ అంటే ఏంటి


రంజాన్ పండుగకు మరో పేరు ఈదుల్ ఫిత్ర్. అంటే ఫిత్రా ఇచ్చే పండుగ. ఫిత్రా అంటే ఓ ప్రత్యేకమైన దానం. పండుగకు ముందు రోజు..ఇంట్లోని కుటుంబసభ్యుల సంఖ్యను బట్టి...అన్ని కిలోల బియ్యం లేదా గోధుమలు పేదలకు దానంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది విధి. అంటే ఓ కుటుంబంలో ముగ్గురు ఉంటే..ఒక్కొక్కరికి 2.60 కిలోల చొప్పున మనం ఏదైతే తింటున్నామో అదే బియ్యం లేదా అదేరకం గోధుమల్ని తీయాలి. ముగ్గురు కుటుంబసభ్యులుంటే 7.8 కిలోలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కుటుంబసభ్యుల సంఖ్యను..2.60 కిలోలతో గుణించి..తీయాలి. దీన్నే ఫిత్రా అంటారు. ఇది ఇవ్వకపోతే పండుగ జరుపుకోవడంలో అర్ధమే లేదు. 


చంద్రుడిని ఎప్పుడు చూడాలి


ఇస్లామిక్ నెల రంజాన్ అత్యంత భక్తి శ్రద్ధలతో నిష్ఠతో జరుపుకుంటారు ముస్లింలు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముస్లిం రంజాన్ నెలలో విధిగా ఉపవాసాలు ఉండాల్సిందే. అత్యవసర అనారోగ్యం, గర్భిణీ స్త్రీలు లేదా బహిష్ఠు సమయంలో మాత్రమే మినహాయింపు ఉంది. సౌదీ దేశాల్లో ఏప్రిల్ 2వ తేదీన, ఇండియాలో ఏప్రిల్  3వ తేదీన రంజాన్ ఉపవాసాలు ప్రారంభమయ్యాయి. తిరిగి 29 రోజుల తరువాత చంద్రుని చూసి ఉపవాస దీక్షలు ముగుస్తారు. 30వ రోజున ఈదుల్ ఫిత్ర్ పండుగ జరుపుకుంటారు. 29 వ రోజున నెలపొడుపు కన్పించకపోతే..30 రోజులు ఉపవాసాలు పూర్తి చేసి..31వ రోజున పండుగ జరుపుకోవాలి.


ఉపవాసాలు ఎలా చేస్తారు


తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో లేచి భోజనం లేదా ఆహారం ఏదో ఒకటి తీసుకోవాలి. దీనినే సెహ్రీ అంటారు. వివిధ దేశాలు, వివిధ ప్రాంతాల కాలమానం బట్టి సమయం అటూ ఇటూ మారుతుంటుంది. ఇండియాలో సరాసరి సెహ్రీ ముంగిపు సమయం 4 గంటల 40 నిమిషాలుగా ఉంది. కొన్ని చోట్ల 4 గంటల 37 నిమిషాలు కావచ్చు. మరికొన్ని చోట్ల 4 గంటల 50 నిమిషాల వరకూ ఉంటుంది. నిర్ధారిత సెహ్రీ సమయం తరువాత ఉపవాసం ప్రారంభమవుతుంది. తిరిగి సాయంత్రం సూర్యోదయం అయ్యే సమయం వరకూ ఉపవాసం కొనసాగుతుంది. ఉపవాసం విడిచే ప్రక్రియను ఇఫ్తార్ అంటారు. దేశంలో ఇఫ్తార్ సరాసరి సమయం 6 గంటల 40 నిమిషాల వరకూ ఉంది. ఏపీలో ఇఫ్తార్ సమయం 6 గంటల 20 నిమిషాలుంది. ఈ సమయంలో ఉపవాసం లేదా రోజాను విడుస్తూ..అల్పాహారం, పండ్లు, హలీమ్ వంటి బలమైన ఆహారాన్ని తీసుకోవచ్చు. 


సెహ్రీ టు ఇఫ్తార్


అంటే సెహ్రీ లేదా సెహరీ నుంచి ఇఫ్తార్ వరకూ ఆరు నూరైనా..నూరు ఆరైనా..మంచి నీళ్లు కూడా తాగనంత నిష్టగా ఉపవాసం ఉండాలి. ఉమ్ము కూడా మింగకూడనంత నిష్టగా ఆచరించాలి. ఎప్పుడూ విధిగా ఉన్నట్టే ఐదు పూట్ల నమాజు తప్పనిసరిగా చేయాలి. రంజాన్ నెలలో అదనంగా ప్రతిరోజూ రాత్రి ప్రత్యేక ప్రార్ధన ఉంటుంది. దీన్నే తరావీ అంటారు. ఈ సమయంలో మసీదుల్లో రంజాన్ నెల 30 రోజుల్లో ఖురాన్ పఠనం పూర్తి చేస్తారు. 


చేసిన పాపాలు లేదా తప్పుల్నించి తమను తాము రక్షించుకునేందుకు ప్రతి ముస్లింకు రంజాన్ నెల ఉపవాసాలు కీలకంగా మారతాయి. రంజాన్ నెలలో దీక్షతో ఉపవాసాలు ఆచరించి అల్లాహ్‌ను ప్రార్ధిస్తే క్షమిస్తాడనేది ముస్లింల నమ్మకం. అందుకే రంజాన్ నెలలో ప్రతి ముస్లిం నిష్టతో ఉపవాసాలు ఆచరిస్తూ ఖురాన్ పఠనం చేస్తూ అల్లాహ్ సన్నిధిలో ఎక్కువగా గడిపేందుకు ఇష్టపడతాడు. 


Also read: Ramadan Importance: రంజాన్ నెలలోనే ఉపవాసాలు ఎందుకు, ఆ నెల ప్రాధాన్యత ఏంటి, ఏడాదంతా ఎందుకు తిరుగుతుంది


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook