Ekadashi Festival 2022: ఇవాళ తొలి ఏకాదశి పండగ. ఏకాదశినే మహా ఏకాదశి, పద్మ ఏకాదశి, దేవశయన ఏకాదశి పేర్లతో పిలుస్తారు. ఆషాఢ శుక్లపక్షం 11వ రోజున ఏకాదశి పండగ వస్తుంది. ఇవాళ్టి నుంచే చాతుర్మాసం కూడా ప్రారంభమవుతుంది. అంటే.. శ్రీ మహా విష్ణువు పాల కడలిపై 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈ చాతుర్మాసం ప్రబోధని ఏకాదశితో ముగుస్తుంది. ప్రతీ ఏటా పూరి జగన్నాథ్ రథయాత్ర తర్వాత ఏకాదశి, చాతుర్మాసం వస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏకాదశి తిథి, సమయం :


ఈ సంవత్సరం తొలి ఏకాదశి ఆదివారం (జూలై 10) వచ్చింది. శనివారం సాయత్రం 4.39 గం.నుంచి ఆదివారం మధ్యాహ్నం 2.13 గం. వరకు ఏకాదశి తిథి ఉంటుంది. ఏకాదశి హరి వాసర సాయంత్రం 7.29గంటలకు ముగుస్తుంది. ఏకాదశి పరణ సమయం సోమవారం (జూలై 11) ఉదయం 5.31 గంటలకు 8.17 గం. వరకు ఉంటుంది.


చాతుర్మాస ప్రారంభం, ముగింపు తేదీ :


చాతుర్మాసం ఇవాళ్టి (జూలై 10) నుంచే ప్రారంభమవుతుంది. 4 నెలల పాటు ఉండే ఈ మాసం నవంబర్ 4న దేవుతని లేదా ప్రబోధని మాసంతో ముగుస్తుంది.


ఏకాదశి పూజలు :


ఏకాదశి రోజున పవిత్ర స్నానం ఆచరిస్తారు. విష్ణు భక్తులు ఉపవాస దీక్ష ఉంటారు. ఉల్లి, మసాలాలు, బీన్స్, ధాన్యాలు వంటివి తీసుకోరు. మహావిష్ణువు ప్రతిమకు పసుపు వస్త్రాలు చుట్టి పువ్వులు, తమలపాకులు సమర్పిస్తారు. చివరగా నైవేద్యం సమర్పించాల్సి ఉంటుంది. ఏకాదశి రోజు రాత్రి భక్తులు భజనల్లో మునిగిపోతారు. రాత్రంతా జాగారం చేస్తారు.


ఏకాదశి ప్రాముఖ్యత :


హిందువులకు తొలి ఏకాదశి చాలా పవిత్ర పండగ. ఈరోజునే విష్ణుమూర్తి పాలకడలిపై శేష తల్పంపై పవళిస్తాడు. అందుకే దీన్ని దేవశయని ఏకాదశి, హరి శయని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇప్పటినుంచి 4 నెలల పాటు విష్ణువు యోగనిద్రలో ఉంటాడు. ఈ మాసంలో విష్ణువు కొలిచేవారికి సుఖ సంతోషాలు కలుగుతాయి.


Also Read: Revanth Reddy:తెలంగాణ కాంగ్రెస్ కు వైఎస్సార్ గండం.. సునీల్ సర్వే రిపోర్టుతో రేవంత్ రెడ్డి కలవరం?


Also Read: Telangana Rain Updates: తెలంగాణలోని ఆ 8 జిల్లాలకు రెడ్ అలర్ట్.. అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్..



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook