Jupiter Transit 2023: బృహస్పతి సంచారం.. కొత్త ఏడాదిలో ఈ ఆరు రాశుల వారికి అంతా శుభమే!
Jupiter Transit 2023 efect on these six signs in new year. కొత్త సంవత్సరంలో బృహస్పతి గ్రహం చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. 2023లో బృహస్పతి సంచారము ఈ ఐదు రాశులను ప్రభావితం చేస్తుంది.
Jupiter Transit 2023: వేద జ్యోతిషశాస్త్రంలో ఆనందం, శ్రేయస్సు, సంపద మరియు అదృష్టం.. మొదలైన వాటికి బృహస్పతి గ్రహం కారకంగా పరిగణించబడుతుంది. ఓ వ్యక్తి జాతకంలో బృహస్పతి గ్రహం బలంగా ఉంటే.. రారాజు అవుతాడు. బృహస్పతి రాశిచక్రం మొత్తం 12 రాశుల మీద ప్రభావం చూపుతుంది. కొత్త సంవత్సరంలో బృహస్పతి గ్రహం చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. 2023లో బృహస్పతి సంచారము ఈ ఐదు రాశులను ప్రభావితం చేస్తుంది. ఆ రాశులు ఏవో ఓసారి చూద్దాం.
మేషం:
బృహస్పతిలో మార్పు వల్ల మేష రాశి వారు ప్రయోజనం పొందుతారు. చాలా కాలంగా పూర్తవని పనులు పూర్తవుతాయి. వ్యాపారులు ఆశించిన లాభాలను పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు విజయం సాధిస్తారు. భారీ లాభాలు వస్తాయి.
మిథున రాశి:
బృహస్పతి సంచారం కారణంగా మిధున రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ధన లాభంతో పాటు పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వారికీ శుభకాలం. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
కర్కాటకం:
కర్కాటక రాశి వారికి బృహస్పతి సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 2023లో బృహస్పతి సంచార ప్రభావంతో కెరీర్‌లో కొత్త అవకాశాలను పొందుతారు. ప్రమోషన్‌తో పాటు ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో గౌరవం, ప్రతిష్టలు పెరుగుతాయి. ఉన్నతాధికారులు మీ పనితీరు పట్ల సంతోషిస్తారు.
కన్య రాశి:
బృహస్పతి రాశి మార్పు కన్య రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం చాలా బాగుంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
తులా రాశి:
తులా రాశి వారి జీవితంలో సంతోషాన్ని కలిగిస్తుంది. శ్రామికులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. డబ్బు సమయానికి చేతికి అందుతుంది. డబ్బు ఆదా చేస్తారు.
మీనం:
గురు రాశి మార్పు మీన రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభాలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్‌తో పాటు ఆదాయం పెరుగుతుంది. ఈ సమయం వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు.
Also Read: IPL 2023 Auction: ఐపీఎల్‌కు సీఎస్‌కే లెజెండ్ గుడ్ బై.. నిరాశలో చెన్నై ఫాన్స్!
Also Read: BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్ రేసులో వెంకటేష్.. ఆ అనుభవం కలిసిరానుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook