February Festivals 2022: వసంత పంచమి, గుప్త నవరాత్రులు.. ఫిబ్రవరిలో పండుగల జాబితా!
February Festivals 2022: ఫిబ్రవరి నెలలో అనగా తెలుగు సంవత్సరాది ప్రకారం మాఘ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి. అందులో వసంత పంచమితో పాటు మౌని అమావాస్య, గుప్త నవరాత్రులు, గణేష్ చతుర్ది సహా అనేక ఉపవాస పర్వదినాలు ఉన్నాయి. ఈ నెలలో ఏఏ పండుగలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
February Festivals 2022: నేటి (ఫిబ్రవరి 2) నుంచి మాఘ మాసం ప్రారంభమైంది. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఏడాదిలో రెండో నెల ఫిబ్రవరి. కానీ, తెలుగు సంవత్సరాది ప్రకారం మాఘ మాసం 11వ నెల. అంటే మరో రెండు నెలల్లో తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రాబోతుంది. అయితే ఈ సారి ఉగాది పండుగ ఏప్రిల్ 2న రానుంది.
అయితే ప్రస్తుతం మాఘ మాసంలో సరస్వతి పూజతో పాటు మౌని అమావాస్య, గుప్త నవరాత్రులతో పాటు అనేక ఉపవాసాలు, పండుగలు ఈ నెలలో ఉన్నాయి. ఫిబ్రవరి నెల మౌని అమావాస్యతో ప్రారంభమైంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 2022లో ఏఏ పండుగలు ఉన్నాయో ఈ జాబితా ద్వారా తెలుసుకుందాం.
ఫిబ్రవరిలో పండుగల వివరాలు..
01 ఫిబ్రవరి 2022: మౌని అమావాస్య.
02 ఫిబ్రవరి 2022: గుప్త నవరాత్రులు ప్రారంభం, చంద్ర దర్శనం.
04 ఫిబ్రవరి 2022: గణేష్ చతుర్ది, గణేష్ జయంతి.
05 ఫిబ్రవరి 2022: వసంత్ పంచమి.
06 ఫిబ్రవరి 2022: స్కంద షష్ఠి.
07 ఫిబ్రవరి 2022: రథసప్తమి, నర్మదా జయంతి.
08 ఫిబ్రవరి 2022: నెలవారీ దుర్గాష్టమి ఉపవాసం.
10 ఫిబ్రవరి 2022: రోహిణి ఉపవాసం.
12 ఫిబ్రవరి 2022: జయ ఏకాదశి ఉపవాసం, స్వామి దయానంద్ సరస్వతి జయంతి.
13 ఫిబ్రవరి 2022: కుంభ సంక్రాంతి, భీష్మ ద్వాదశి.
14 ఫిబ్రవరి 2022: సోమవారం ప్రదోష వ్రతం, ప్రేమికుల రోజు.
16 ఫిబ్రవరి 2022: మాఘ పూర్ణిమ, భైరవ జయంతి, గురు రవిదాస్ జయంతి.
17 ఫిబ్రవరి 2022: ఫాల్గుణ మాసం ప్రారంభం.
20 ఫిబ్రవరి 2022: గణేష్ చతుర్ది ఉపవాసం.
23 ఫిబ్రవరి 2022: కాలాష్టమి.
24 ఫిబ్రవరి 2022: జానకి జయంతి.
27 ఫిబ్రవరి 2022: విజయ ఏకాదశి ఉపవాసం.
28 ఫిబ్రవరి 2022: సోమవారం ప్రదోష ఉపవాసం.
Also Read: Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారు శుభవార్త వింటారు!!
Also Read: Palmistry: అరచేతిలో ఆ గుర్తు ఉంటే.. ఎంత పేదోడిగా పుట్టినా అపర కుబేరుడు అవుతాడట..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook