Palmistry: అరచేతిలో ఆ గుర్తు ఉంటే.. ఎంత పేదోడిగా పుట్టినా అపర కుబేరుడు అవుతాడట..

Palm Reading: అరచేతిలో రాహువు స్థానంలో త్రిభుజం గుర్తు ఉంటే.. అలాంటి వ్యక్తులు చాలా ధనవంతులవుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం వారిపై ఉంటుంది. ఫలితంగా వారి వద్ద ఎప్పుడూ డబ్బు ఉంటుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2022, 05:01 PM IST
  • అరచేతిలో ఆ స్థానాల్లో త్రిభుజం ఉంటే అపర కుబేరులే
  • వారికి ఎల్లప్పుడూ లక్ష్మి కటాక్షం ఉంటుంది
  • సంపాదనలో ఎప్పుడూ ముందుంటారు
 Palmistry: అరచేతిలో ఆ గుర్తు ఉంటే.. ఎంత పేదోడిగా పుట్టినా అపర కుబేరుడు అవుతాడట..

Palm Reading: అరచేతిలో పలు రేఖలు, ఆకారాలు, అలాగే కొన్ని ప్రత్యేక చిహ్నాలు మనకు కనిపిస్తుంటాయి. కాలక్రమేణా వీటన్నింటిలో మార్పులు సంభవిస్తాయి. అవి మన జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తాయి. వీటిల్లో కొన్ని రేఖలు జీవితంలో భారీ మార్పులకు కారణమవుతాయి. ఆ మార్పులు మంచివో, చెడ్డవో తెలియాలంటే ఆ రేఖల గురించి తెలిసి ఉండాలి. అలాంటి కొన్ని ప్రత్యేకమైన రేఖల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

అరచేతిలో ఆ గుర్తు ఉంటే ధనవంతులే.. :

అరచేతిలో సూర్య పర్వతంపై త్రిభుజం గుర్తు ఉంటే.. ఆ వ్యక్తి ఎంత పేద కుటుంబంలో పుట్టినా అపారమైన సంపదకు యజమాని అవుతాడు. అలాంటి వారికి ఎంతో పేరు, ప్రతిష్ఠలు కలుగుతాయి. 

ఆ వ్యక్తులు సవాళ్లను అధిగమిస్తారు :

అరచేతిలో గురు పర్వతంపై చతురస్రం ఉన్నట్లయితే.. ఆ వ్యక్తి మంచి నిర్వాహకుడిగా పేరు తెచ్చుకుంటాడు. అలాంటివారు అన్ని సవాళ్లను అధిగమించి ఉన్నత స్థానానికి చేరుకుంటారు.

అరచేతిలో అక్కడ త్రిభుజం ఉంటే..

అరచేతిలో (Palm Reading )రాహువు స్థానంలో త్రిభుజం గుర్తు ఉంటే.. అలాంటి వ్యక్తులు చాలా ధనవంతులవుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం వారిపై ఉంటుంది. ఫలితంగా వారి వద్ద ఎప్పుడూ డబ్బు ఉంటుంది. అలాంటివారు తమ తెలివితేటలతో బాగా డబ్బు సంపాదిస్తారు. రాహు పర్వతంపై త్రిభుజం గుర్తును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఆ గుర్తు కలిగిన వ్యక్తులు పెద్ద వ్యాపారవేత్తలు అవుతారు. అపర కుబేరుల లాగా డబ్బు సంపాదిస్తారు. 
 

Also Read: ICC Awards: 'టీ20 ప్లేయర్​ ఆఫ్​ ది ఇయర్​'గా పాక్​ క్రికెటర్​.. ట్యామీ బ్యూమోంట్‌కు ఐసీసీ అవార్డు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News