Gajakesari Yoga: మీనంలో అరుదైన యోగం... ఈ రాశులకు ఊహించనంత ధనం..
Gajakesari Yoga: మీనరాశిలో గురుడు గజకేసరి యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఈ యోగం కొన్ని రాశులవారికి చాలా శుభకరంగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం.
Gajakesari Yoga: జ్యోతిషశాస్త్రంలో బృహస్పతిని శుభ గ్రహంగా పరిగణిస్తారు. ఏప్రిల్ 13, 2022న గురుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. ప్రస్తుతం మీనరాశిలో తిరోగమనంలో ఉన్న బృహస్పతి ఈనెల 24న ప్రత్యక్ష సంచారంలోకి రానున్నాడు. దీని కారణంగా గజకేసరి రాజయోగం (Gajakesari Yoga) ఏర్పడుతోంది. దీని ప్రభావం అనేక రాశులవారిపై కనిపిస్తుంది. ఆస్ట్రాలజీలో గజకేసరి యోగం చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు. గజకేసరి యోగం వల్ల ఏరాశులవారి లాభపడనున్నారో తెలుసుకుందాం.
మేషరాశి(Aries): గురు మార్గి కారణంగా ఏర్పడిన గజకేసరి యోగం మేష రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అనవసర ఖర్చుల తగ్గుతాయి. ఆర్థికంగా లాభపడతారు. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు తీసుకుంటారు. విదేశీ పర్యటన చేసే అవకాశం ఉంది.
తులా రాశి (Libra): బృహస్పతి మార్గం కావడం వల్ల ఏర్పడిన గజకేసరి రాజయోగం తులారాశి వారికి శుభప్రదంగా ఉండనుంది. ఈ సమయంలో పెళ్లికాని యువతీయువకులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారు దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి పొందుతారు. వృత్తిలో ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. కొత్త జాబ్ ఆఫర్ అందుకునే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి(Scorpio): బృహస్పతి ప్రత్యక్ష కదలిక కారణంగా గజకేసరి యోగం వృశ్చికరాశి వారికి చాలా మేలు చేస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఉద్యోగ, వ్యాపారాలలో లాభాలను పొందుతారు. ఈరాశివారు కెరీర్ లో పురోభివృద్ధి సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. విద్యార్థులకు ఈ సమయం బాగుంటుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు.
బృహస్పతిని బలపరిచే పరిహారాలు:
>> గురువారం ఉపవాసం ఉండండి.
>> గురు యంత్రాన్ని ఇన్‌స్టాల్ చేయండి.
>> గురు గ్రహ శాంతి పూజ చేయండి.
>> పసుపు లేదా క్రీమ్ రంగు దుస్తులు ధరించండి.
>> భక్తితో రోజూ శివుని పూజించండి
>> బృహస్పతికి సంబంధించిన పసుపు బట్టలు, పప్పు, పసుపు పువ్వులు, పసుపు మొదలైన వాటిని దానం చేయండి.
Also Read: Grah Gochar 2022: నవంబర్ నెలలో ఈ రాశుల వారికి డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా మరి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook