Gajkesri Rajyog In Meen: ఆస్ట్రాలజీలో గజకేసరి రాజయోగం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఎవరి జాతకంలో ఈ రాజయోగం ఏర్పడుతుందో వారు రాజులా బతుకుతారు. వీరికి దేనికీ లోటు ఉండదు. ఇవాళ అంటే డిసెంబరు 31 సాయంత్రం మీన రాశిలో గజకేసరి రాజయోగం (Gajkesari Rajyog) ఏర్పడుతుంది. ఈ యోగం బృహస్పతి మరియు చంద్రుని కలయిక వల్ల ఏర్పడుతుంది. ఇది మూడు రాశులవారికి అపారమైన ప్రయోజనాలను ఇస్తుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటకం (Cancer): గజకేసరి రాజయోగం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో తొమ్మిదో ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. దీంతో మీకు ప్రతి పనిలోనూ అదృష్టం కలిసి వస్తుంది. మీరు పూర్వీకుల ఆస్తి ద్వారా ప్రయోజనం పొందుతారు. పెళ్లికాని యువతీ యువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారం నిమిత్తం టూర్ కు వెళ్లే  అవకాశం ఉంది. విదేశాల్లో చదువుకోవాలన్న మీ కోరిక నెరవేరుతుంది. 


మిథునం(Gemini): గజకేసరి రాజయోగం వృత్తి మరియు వ్యాపార పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి దశమ స్థానంలో ఈ యోగం ఏర్పడబోతోంది. అందుకే ఈ సమయంలో నిరుద్యోగులకు జాబ్ ఆఫర్లు రావచ్చు. మీరు పార్టనర్ షిప్ తో ఏదైనా ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. మీ సంపాదన కూడా బాగానే ఉంటుంది. ఉద్యోగులకు ప్రశంసలు దక్కుతాయి. 


వృషభ రాశి (Taurus): గజకేసరి రాజయోగం మీకు డబ్బు పరంగా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి 11వ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. అందుకే ఈ సమయంలో మీ ఆదాయం పెరుగుతుంది. దీంతో మీకు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. మీరు ఏదైనా రుణం నుండి విముక్తి పొందే అవకాశం ఉంది. మీరు ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. 


Also Read: Vasant Panchami 2023: వసంత పంచమి ఎప్పుడు? ఈ పండుగ విశిష్టత ఏంటి?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook