Ganesh Chaturthi 2023 Time And Date: భారత్‌తో ఎంతో పవిత్రంగా జరుపుకునే పండగల్లో గణేష్‌ చతుర్థి ఒకటి. ఈ పండగను భాద్రపద మాసం, శుక్ల పక్ష చతుర్థి తేదీన జరుపుకుంటారు. ఈ పండుగ శుక్ల పక్ష చతుర్థి రోజు ప్రారంభమై..అనంత చతుర్దశి రోజు ముగుస్తుంది. ఈ పండగను తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలతో పాటు గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం సెప్టెంబర్ 19న గణేష్ పండగ వస్తోంది. కానీ కొన్ని గ్రహాల కలయిక కారణంగా గణపతి ప్రతిష్ఠాపన సమయంలో మార్పలు చేర్పులు ఉండే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ రోజు ఏయే సమయాల్లో గణపతి ప్రతిష్ఠాపన చేయడం మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్‌ వ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. యువత ఎంతో ఉత్సహంతో డప్పు వాయిద్యాలతో గణేషుడి విగ్రహాన్ని మండపాల వద్దుకు తీసుకువస్తారు. అంతేకాకుండా యువత ఈ సమయంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఉంటారు. అయితే మండపాల్లో గణేష్‌ విగ్రహాలను ప్రతిష్ఠించే సమయంలో ఈ ప్రత్యేక ఆచార వ్యవహారాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. 


Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  


ఈ సమయాలు చాలా అనుకూలమైనవి:
చతుర్థి తిథి 18 సెప్టెంబర్ 2023న మధ్యాహ్నం 12:39 గంటలకు ప్రారంభమై.. సెప్టెంబర్ 19వ తేదీ మధ్యాహ్నం 01:43 గంటలకు ముగుస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. గణపతి ప్రతిష్ఠాపనకు లేదా పూజకు అనుకూలమైన సమయం ఉదయం 11:01 నుంచి మధ్యాహ్నం 01:28 వరకు ఉంటుంది. ముహూర్తపు మొత్తం వ్యవధి 02 గంటల 27 నిమిషాలు పాటు ఉండబోతోందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.


ఈ సమయంలో పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదు:
వినాయ చవితి ఒక రోజు ముందు చంద్రుడిని చూడకూడదని పూరణాల నుంచి ఆనవాయితిగా వస్తోంది. సెప్టెంబర్ 18 రోజున మధ్యాహ్నం 12:39 నుంచి రాత్రి 08:10 వరకు చంద్రుడిని చూడకూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. మొత్తం కాలం వ్యవధి 10 గంటల 59 నిమిషాలు పాటు ఉంటుంది. 


Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook