Ganesh Nimajjanam Rules: గణేశ్ నిమజ్జనం రేపు సెప్టెంబర్ 9వ తేదీన దేశవ్యాప్తంగా ఘనంగా జరగనుంది. వినాయకుని నిమజ్జనం సందర్భంగా పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. అవేంటో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూమతంలో గణేశ్ చతుర్ధి నాడు గణేశుని ప్రతిష్ఠించి..10 రోజుల తరువాత నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుపుతారు. 10 రోజుల తరువాత అత్యంత భక్తి శ్రద్ధలతో గణేశుని నిమజ్జనం చేస్తారు. దాంతోపాటు ఇంట్లో ఆనందం, సుఖ శాంతులు వర్ధిల్లాలని ప్రార్ధిస్తారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం..


గణేశ్ నిమజ్జనం శుభ ముహూర్తం


గణేశ్ నిమజ్జనం అనంత చతుర్ధశి రోజు చేస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీ అంటే రేపు జరగనుంది. గణేశ్ నిమజ్జనానికి శుభ ముహూర్తం ఉదయం 6 గంటల 3 నిమిషాల్నించి 10 గంటల 44 నిమిషాలవరకూ ఉంటుంది. సాయంత్రం తిరిగి 5 గంటల్నించి మొదలుకుని 6 గంటల 30 నిమిషాలవరకూ ఉంటుంది.


1. గణేశ్ నిమజ్జనానికి ముందు భక్తి శ్రద్ధలతో గణపతి పూజ చేయాలి. ఈ సందర్భంగా గణపతికి వక్క, పాన్, కొబ్బరికాయలు అర్పించాలి. ఈ సామగ్రిని కూడా గణపతితో పాటే నిమజ్జనం చేయాలి. కానీ కొబ్బరికాయను పగలగొట్టకూడదు. 


2. గణపతి నిమజ్జనం చేస్తున్నప్పుడు గణేశ్ విగ్రహాన్ని పొరపాటున కూడా ఒక్క ఉదుటున నిమజ్జనం చేయకూడదని గుర్తుంచుకోవాలి. నెమ్మది నెమ్మదిగానే విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయాల్సి ఉంటుంది.


3. ఇంట్లోనే గణపతిని నిమజ్జనం చేస్తుంటే..విగ్రహం కంటే పెద్దదైన ఓ పాత్రను తీసుకోవాలి. ఇందులో విగ్రహాన్ని నెమ్మది నెమ్మదిగా ముంచాలి. ఆ నీళ్లను బయట పాడేయకూడదు. ఏదైనా మొక్క లేదా చెట్టు మొదళ్లో వేయాలి. ఆ నీళ్లు కిందకు అంటే నేలపై రాకుండా చూసుకోవాలి. చేతులు కూడా శుభ్రంగా ఉండాలి.


4. గణపతి నిమజ్జనం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా చేయాలి. పొరపాటున కూడా నల్ల రంగు బట్టలు ధరించకూడదు.


Also read: Thursday Remedies: విష్ణు కటాక్షం కోరుకుంటున్నారా..అయితే గురువారం పొరపాటున కూడా చేయకూడని పనులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook