Wednesday Remedies: హిందువులు వారంలోని ప్రతి రోజూ ఏదో ఒక దేవతను పూజిస్తారు. బుధవారం వినాయకుడిని ఆరాధిస్తారు. ఈరోజున గణపతిని (Lord Ganesha) పూజించడం వల్ల మీ బాధలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా బుధవారం గణేశుడికి కొన్ని పరిహారాలు చేయడం ద్వారా మీ జాతకంలోని బుధ గ్రహం బలపడుతుంది.  దీంతో మీ కెరీర్ లోని అడ్డంకులన్నీ తొలగిపోతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పరిహారాలు చేయండి
>> బుధవారం దానానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈ రోజు పచ్చని వస్తువులు దానం చేస్తే మీ కెరీర్ లో అద్భుతమైన పురోగతి ఉంటుంది. వీలైతే వివాహిత స్త్రీలు ఆకుపచ్చ రంగు దుస్తులు లేదా గాజులను దానం చేయండి. 
>> బుధవారం నాడు గణపతిని పూజించేటప్పుడు 'ఓం గం గణపతయే నమః' అనే మంత్రాన్ని జపించండి. దీంతో వినాయకుడు సంతోషించి.. మీ కష్టాలన్నింటినీ తొలగిస్తాడు.  
>>  మీ చేతి చిటికెన వేలికి పచ్చలు ధరించడం వల్ల మీ బుధ దోషం తొలగిపోతుంది. అయితే దీని కోసం జ్యోతిష్యుడి సలహా తీసుకోండి. 
>> బుధ దోషం కారణంగా మీ కెరీర్‌లో అడ్డంకులు ఎదురవుతాయి.  దీని నుండి బయటపడటానికి బుధవారం బంగారు ఆభరణాలు ధరించడం ప్రయోజనకరం. అంతే కాకుండా ఇంటి తూర్పు దిశలో ఎర్ర జెండాను ఉంచితే బుధగ్రహం యొక్క దుష్ఫలితాలను తగ్గుతాయి.


Also Read: Raksha Bandhan 2022: రాఖీ పండుగ ఆగస్టు 11 లేదా ఆగస్టు 12? 



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook