COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Garuda Purana Facts On Women: హిందూ సాంప్రదాయం ప్రకారం..18 మహాపురాణాలు గురించి కవులు ఎన్నో గ్రంథాల్లో ప్రస్తావించారు. అయితే హిందూ మతంలో ఉన్న మహాపురాణాలలో గరుడ పురాణాకి ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. మానపులు మరణించిన తర్వాత పరిస్థితులు, సంతోషకరమైన జీవితం, ఉపవాసాలు, పూజలు, విష్ణువు ఆరాధన నియమాల గురించి గరుడ పురాణం పూర్తిగా వివరిస్తుంది. అంతేకాకుండా ఈ పురాణంలో స్త్రీలు, వారికి ఉండాల్సిన గుణాలు, పాత్ర, లక్షణాల గురించి కూడా తెలుపుతుంది. కాబట్టి ఈ గరుడ పురాణం ప్రకారం..ఒక ఇంటీ స్త్రీ భర్తకు అదృష్టవంతురాలు అవ్వాలనుకుంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..


గరుడ పురాణం ప్రకారం స్త్రీలు ఈ లక్షణాలు కలిగి ఉండాలి:
విధికి కట్టుబడి ఉండాలి:

ఒక స్త్రీ మంచి సద్గుణాలు కలిగి ఉండాలంటే ఎప్పుడు తన విధులకు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. దీంతో పాటు తన బాధ్యతలను ఎలా నిర్వహించాలో తెలిసిన భార్య కుటుంబానికి అదృష్టవంతురాలు అవుతుందని గరుడ పురాణం చెబుతోంది. సత్ప్రవర్తన గల స్త్రీ తన భర్తకు మంచి సపోర్ట్‌ను ఇవ్వడమే కాకుండా అదృష్టాన్ని కూడా రెట్టింపు చేస్తుందని గరుడ పురాణంలో పేర్కొన్నారు. అంతేకాకుండా స్త్రీ తన జీవితంలో ఎలాంటి తప్పులు చేయడని కూడా సూచిస్తోంది.


విధేయత:
గరుడ పురాణం ప్రకారం..స్త్రీని ఇంటికి పెద్దగా భావిస్తారు. కాబట్టి తన భర్త, ఇంటి పెద్దలకు విధేయత చూపే భార్య సద్గుణంగా పరిగణిస్తారు. అంతేకాకుండా కుటుంబానికి పెద్దగా భావించే స్త్రీ ఎలాంటి పనులు చేసిన సుఖం, శాంతి, ఆనందం కోసం మాత్రమే చేయాల్సి ఉంటుంది. గుడ్డిగా ఏ పనులు పడితే ఆ పనులు చేయడం సరికాదు అంటోంది గరుణ పురాణం.


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి


గౌరవం:
సద్గుణలు కలిగిన స్త్రీ గౌరవ భావనంతో సమాజంలో నడుచుకుంటుంది. తన భర్తను, కుటుంబ పెద్దలను, తనను తాను ఎలా గౌరవించాలో నిత్యం అమె తెలుసుకుంటుంది. అంతేకాకుండా గౌరవంతో ఇలాంటి స్త్రీలు పెద్ద, చిన్నవారితో గౌరవంగా, ప్రేమగా మాట్లాడుతుంది. ఇలా వారికి ఎల్లప్పుడు అదృష్టం వెంటనే ఉంటుందని పురణం చేబుతోంది. 


ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి