హిందూ పంచాంగంలో జ్యోతిష్యశాస్త్రం, వాస్తు శాస్త్రాలకు చాలా ప్రాధాన్యత, మహత్యమున్నాయి. కొన్ని రాశులకు, గ్రహాలకు సంబంధించి ప్రత్యేకమైన రత్నాలుంటాయి. ఎవరికి ఏది మంచిదో తెలుసుకుని వాడితే అంతులేని ప్రయోజనాలు కలుగుతాయని అంటారు. ఏ రాశి, ఏ గ్రహానికి ఏ రత్నం ధరించాలనేది చాలా అవసరం. ఇవాళ ఎమెరాల్డ్ రత్నం గురించి తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధ గ్రహం బుద్ధుడికి కారకమైన గ్రహం. ఆత్మ విశ్వాసం లోపించినా లేదా బుద్ధి తగ్గినా ఎమెరాల్డ్ ధరించాలి. ఆత్మ విశ్వాసంతోనే బుద్ధి వికసిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం అభివృద్ధి చెందాలంటే ఎమెరాల్డ్ తప్పకుండా ధరించాల్సిందే. ఉద్యోగ, వ్యాపార వర్గాలకు అభివృద్ధి ఉంటుంది. 


ఎమెరాల్డ్ ధరించడం వల్ల అసంపూర్ణంగా ఉన్న పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంట్లో సరైన స్థానంలో ఎమెరాల్డ్ అమర్చుకుంటే మంచి ఫలితాలుంటాయి. దాంతోపాటు సంతాన సుఖం కోరుకునేవారు కూడా ఈ రత్నమే ధరించాలి.


మిధునరాశివారికి వైవాహిక జీవితం సరిగ్గా లేకపోతే..ఎమెరాల్డ్ రత్నాన్ని ధరించాలి. దీనివల్ల వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురౌతాయి. కన్యారాశివారు ఎమెరాల్డ్ ధరిస్తే..తల్లిదండ్రులు, ఉద్యోగం, వ్యాపారాల్నించి లాభం కలుగుతుంది. 


ఎమెరాల్డ్ థారణ కూడా సరిగ్గా ఉండాలి. లేకపోతే ఆశించిన ఫలముండదు. ఎమెరాల్డ్ ధారణ ఎప్పుడూ వెండి ఉంగరంలోనే ఉండాలి. చిటికెన వేలుకే ధరించాలి. జ్యోతిష్య పండితుల సూచన అవసరం.


ఎమెరాల్డ్ రత్నాన్ని పచ్చని దారం లేదా ఛైన్‌లో లాకెట్ రూపంలో కూడా ధరించవచ్చు. బుధవారం ఉదయం వేళ పచ్చిపాలు లేదా గంగాజలంతో ఎమెరాల్డ్ రత్నాన్ని అభిషేకించి..ధరించాలి. తరువాత బుధ మంత్రం జపించాలి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జ్యోతిష్య పండితుల సలహాతోనే ఎవరు ఏ రత్నాన్ని ధరించాలనేది నిర్ణయించుకోవాలని పండితులు చెబుతున్నారు. 


Also read: Baba Vanga Predictions: ఆందోళన కల్గిస్తున్న బాబా వేంగా జోస్యం, ఇండియాలో అలా జరుగుతుందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook