Golden days begin for These 3 Zodiac Sign peoples due to Shash Mahapurush Yog 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో తన రాశి చక్రాన్ని మారుస్తుంది. గ్రహ సంచారం అన్ని రాశుల వ్యక్తులపై విభిన్న ప్రభావాలను చూపిస్తుంది. 2023 జనవరి 17న శని గ్రహం తన సొంత రాశి అయిన కుంభ రాశిలో సంచరించబోతోంది. ఈ శని సంచారం వలన 'శష మహాపురుష యోగం' ఏర్పడుతుంది. ఈ యోగం పలు రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని గ్రహం కర్మను ఇచ్చేవాడిగా పరిగణిస్తారు. అంతేకాదు న్యాయాన్ని ఇచ్చే దేవుడు అని కూడా పిలుస్తారు. శని దేవుడు ఒక వ్యక్తి యొక్క కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు. ఈ నేపథ్యంలో పలు రాశి చక్రాల ప్రజలకు శని యొక్క సంచారం బాధాకరమైనదిగా మరియు కష్టాలతో నిండి ఉంటుంది. కొన్ని రాశుల స్థానికులకు అనుకూలంగా ఉంటుంది. 2023 జనవరి 17న శని గ్రహం కుంభ రాశిలోకి ప్రవేశిస్తుంది. దాంతో ఐదు మహాపురుషులలో ఒకటైన 'శష మహాపురుష యోగం' ఏర్పడుతోంది. ఈ సమయం ఏ రాశుల వారికి విశేష ప్రయోజనాలు అందిస్తుందో తెలుసుకుందాం.


వృషభం:
శష మహాపురుష యోగం వృషభం రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. శని మరియు శుక్రుడి మధ్య స్నేహం ఉంటుంది. ఈ నేపథ్యంలో వృషభ రాశి వారికి అన్ని రంగాలలో విజయాలు దక్కుతాయి. మీ పని ప్రశంసించబడుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.


తులా రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులా రాశి వారికి శష మహాపురుష యోగం శుభప్రదంగా, ఫలప్రదంగా ఉంటుంది. చాలా కాలంగా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వ్యక్తులు విజయం సాధిస్తారు. కొత్త ఉద్యోగం ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలలో చాలా లాభాలుంటాయి.


ధనుస్సు రాశి:
శని యొక్క శష మహాపురుష యోగం ధనుస్సు రాశి వారికి చాలా ఫలవంతంగా ఉంటుంది. శని దేవుడు తన దీవెనలను ఈ రాశి వారిపై కురిపిస్తాడు. శని దేవుని అనుగ్రహం వల్ల మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. భారీ ఉపశమనం లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అందరూ మీ పనిని అభినందిస్తారు.


Also Read: IND vs SL 3rd T20: శుభ్‌మాన్ గిల్‌ ఔట్.. స్టార్ ప్లేయర్ ఇన్! మూడో టీ20కి భారత తుది జట్టు ఇదే  


Also Read: TS Sankranti 2023 Holidays: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. స్కూళ్లకు 5, కాలేజీలకు 3రోజుల సెలవులు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.