Good Friday 2023 Significance: క్రైస్తవ మతాన్ని ఫాలో అయ్యే వారు అంతా గుడ్ ఫ్రైడేని చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఈ ఏడాది గుడ్ ఫ్రైడే 7 ఏప్రిల్ 2023న జరుపుకుంటారు. గుడ్ ఫ్రైడే రోజున క్రైస్తవ మతానికి చెందిన వారంతా తమ దైవంగా భావించే యేసు ప్రభువు త్యాగాన్ని స్మరించుకుంటూ రోదిస్తారు. అందుకే చాలా మంది దీనిని బ్లాక్ డే అని కూడా అంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్రైస్తవులకు ఈ గుడ్ ఫ్రైడే చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున ప్రజలు చర్చిలలో ప్రార్థనలు చేస్తారు, ఆ తరువాత శిలువను ముద్దుపెట్టుకోవడం ద్వారా యేసుక్రీస్తును స్మరించుకుంటారు. యేసు ప్రభువు బోధనలు  గుర్తు తెచ్చుకుని వారు ఆరోజంతా ప్రార్ధనలు చేస్తూ ఉంటారు. ఇక ఎల్లప్పుడూ దయను అలవర్చుకోవడం ద్వారా అహింసా మార్గాన్ని అనుసరించమని యేసు ప్రజలను ప్రేరేపించారు, అయితే యేసు చాలా రోజులు హింసించబడిన తరువాత సిలువ వేయబడ్డాడు.


అయితే ఈ గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు? మరణానికి ముందు యేసు క్రీస్తు చివరి మాటలు ఏమిటో తెలుసుకుందాం. యేసుక్రీస్తు క్రైస్తవ మత స్థాపకుడిగా భావిస్తూ ఉంటారు. యేసు తన జీవితమంతా మానవజాతి సంక్షేమం కోసం వెచ్చించారు, యేసు శాంతి, ప్రేమకు మెస్సీయ అని పిలువబడ్డాడు. ప్రజలు యేసు ప్రభువు ఆలోచనలచే ప్రభావితులయ్యారు, యేసు  ఎల్లప్పుడూ మంచి పనులు అలవరచుకోవడానికి, చెడు పనులు విడిచిపెట్టాలని ప్రజలను ప్రేరేపించారు.


దీంతో ఏసుక్రీస్తుపై రోమ్ పాలకులను ఉసిగొల్పేందుకు ప్రయత్నించి, ఆ తర్వాత ఏసుక్రీస్తుకు అన్ని శారీరక, మానసిక హింసలను అందించిన యూదు పాలకులు శుక్రవారం నాడే ఆయనను శిలువ వేశారు. అందుకే క్రైస్తవ మతం వారంతా ఈ రోజును గుడ్ ఫ్రైడే లేదా పవిత్ర శుక్రవారంగా జరుపుకుంటారు. ఇక యూదు పాలకులు యేసు ప్రభువు పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించారు, అయితే అంత క్రూరంగా ప్రవర్తించినా క్షమాపణ ఇచ్చారు. 


Also Read: Naresh Pavitra Special Pooja: సొంతఊరిలో పవిత్రతో కలిసి నరేష్ సందడి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు!


Also Read: Manchu Manoj Video: మొన్న అన్నకి షాకిచ్చిన మనోజ్.. ఇప్పుడు మరో వీడియోతో రచ్చ!



 

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook