Planet Transit in April 2023:  ఏప్రిల్ నెల మొదలైంది. ఈ నెలలో కొన్ని పెద్ద గ్రహాలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి రవాణా కాబోతున్నాయి.  ఏప్రిల్ 14న సూర్యుడు,  ఏప్రిల్ 21న బుధుడు, ఏప్రిల్ 22న బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించబోతున్నారు. రేపు శుక్రుడు వృషభరాశి ప్రవేశం చేయనున్నాడు. అంతేకాకుండా కొన్ని గ్రహాలు ఉదయించడం లేదా అస్తమించడం చేస్తాయి. గ్రహాల గమనంలో పెను మార్పు ఏప్రిల్‌లో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహరాశి 
ఏప్రిల్ నెలలో గ్రహాల సంచారం కారణంగా సింహ రాశి వారు తమ వృత్తి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. మీపై ప్రత్యర్థులు విజయం సాధిస్తారు. ఈసమయంలో పెట్టుబడి పెట్టాలనే ఆలోచిన విరమించుకోండి. ఈ ఫ్లానెట్స్ మార్పు మీ కెరీర్ లో ఒడిదుడుకులను సృష్టిస్తుంది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి. 


తులారాశి
ఈ మాసంలో తుల రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. తోబుట్టువులతో వివాదాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఆలస్యం కావచ్చు. మీ జీతంలో కోత ఉండవచ్చు. అధికారులతో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఆరోగ్యాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. 


Also Read: Guru Gochar 2023: 12 ఏళ్ల తర్వాత మీట్ అవ్వబోతున్న సూర్యుడు-గురుడు.. ఈ 5 రాశులను వరించనున్న అదృష్టం, ఐశ్వర్యం!


వృశ్చిక రాశి
ఈ రాశి వారు ఏప్రిల్‌లో ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో డబ్బు లావాదేవీలు చేయడం మానుకోండి, లేదంటే ధన నష్టం జరగవచ్చు. హెల్త్ దెబ్బతినవచ్చు. జీవితంలో అడ్డంకులు ఎదురవుతాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 


మకరరాశి
ఏప్రిల్ నెల మకర రాశికి చెందిన వారి జీవితంలో అడ్డంకులు ఎదురవుతాయి. కోసం విదేశాలకు వెళ్లాలని భావించే విద్యార్థులకు ఇబ్బందులును ఎదుర్కోవల్సి ఉంటుంది. మీ పనితీరు దిగజారుతుంది. తద్వారా మీరు మీపై వారితో తిట్లు తింటారు. దాంపత్య జీవితంలో సమస్యలు వస్తాయి. వ్యాపారులకు ఈ సమయం అస్సలు కలిసిరాదు. 


Also Read: April Horoscope 2023: ఈనెలలో రాశిని మార్చబోతున్న గ్రహాలు, దశ తిరగనున్న రాశులివే..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook