What is Guru Chandal Dosh: ఒకే రాశిలో రెండు గ్రహాల కలయికను మైత్రి లేదా సంయోగం అంటారు. గురు, రాహువుల కలయిక వల్ల గురు చండాల యోగం ఏర్పడుతుంది. జ్యోతిషశాస్త్రంలో ఈ యోగం లేదా దోషాన్ని చాలా అశుభకరమైనదిగా భావిస్తారు. త్వరలో దేవగురువు బృహస్పతి తన నక్షత్రాన్ని మార్చబోతున్నాడు. అశ్వినీని వదిలి భరణి నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా గురు చండాల దోషం తొలగిపోతుంది. ఈ దోషం తొలగిపోయిన వెంటనే ఈ 5 రాశుల వారిని అదృష్టం వరిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధనుస్సు రాశి
గురు చండాల దోషం తొలగిపోవడం ధనుస్సు రాశి వారికి వరమనే చెప్పాలి. ఇది పెట్టుబడి పెటట్డానికి మంచి సమయమనే చెప్పాలి. మీరు మంచి రాబడిని పొందుతారు. విదేశాల్లో చదువుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. 
మిధునరాశి
గురు చండాల యోగం తొలగిపోవడం వల్ల మిథునరాశి వారిని అదృష్టం వరిచనుంది. దీంతో మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అనుకున్న సమయానికి మీ పనులు పూర్తవుతాయి. 
మకరరాశి
గురు చండాల దోషం తొలగిపోవడంతో మకర రాశి వారికి లాభసాటి అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు జాబ్ వస్తుంది. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.


Also Read: Budh Asta 2023 Date: బుధుడి అస్తమయంతో మారిన ఈ రాశుల అదృష్టం, ఇక వీరికి తిరుగుండదు..


కర్కాటకం
కర్కాటక రాశి వారికి గురు చండాల యోగం ముగింపు శుభప్రదం కానుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. హఠాత్తుగా డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం సాధించాలనే మీ కోరిక నెరవేరుతుంది. 
సింహం
గురు చండాల దోషం తొలగిపోవడం సింహ రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. ఈ సమయంలో అదృష్టం మీ వెంట ఉంటుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది.


Also Read: Mars transit 2023: సూర్యుని రాశిలోకి కుజుడు... ఈ 4 రాశులకు లక్కే లక్కు.. లాభాలే లాభాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook