Chaturgrahi Yog: గురు రాశిలో `చతుర్గ్రాహి యోగం`.. ఈ రోజు నుంచి రాశులకు అన్నీ లాభాలే..
Chaturgrahi Yog: హిందూ పంచాంగం ప్రకారం, మీన రాశిలో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతోంది. దీంతో మూడు రాశులవారు ప్రదానంగా లాభపడనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Guru Gochar 2023: ప్రతి గ్రహం నిర్ణీత సమయం తర్వాత తన రాశిని మార్చి.. ఇతర ఫ్లానెట్స్ తో మైత్రిని ఏర్పరుస్తాయి. ఇవాళ బృహస్పతి రాశి అయిన మీనరాశిలో సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి మరియు బుధ గ్రహాల కలయిక వల్ల చతుర్గ్రాహి యోగం ఏర్పడింది. దీని ప్రభావం ప్రజలందరిపై కనిపిస్తుంది. చతుర్గ్రాహి యోగం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం.
చతుర్గ్రాహి యోగం ఈ రాశులకు వరం
మిధునరాశి
చతుర్గ్రాహి యోగం మిథునరాశివారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ యోగం మీ కర్మస్థానంలో ఏర్పడుతుంది. దీంతో నిరుద్యోగులకు ఉద్యోగ ఆఫర్లు వస్తాయి. వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు. మీరు కెరీర్ లో అపారమైన పురోగతి సాధిస్తారు. శత్రువుల ముప్పు తొలగిపోతుంది. మిమ్మల్ని అవార్డు వరించే అవకాశం ఉంది. పాలిటిక్స్ లో ఉన్నవారు పదవిని పొందే అవకాశం ఉంది.
వృషభం
చతుర్గ్రాహి యోగం వృషభ రాశి వారికి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ సంచార జాతకంలో 11వ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. మీరు పాత పెట్టుబడి నుండి లాభం పొందుతారు. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో భారీగా లాభం ఉంటుంది. మెుత్తానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
కుంభ రాశి
మీన రాశిలో చతుర్గ్రాహి యోగం ఏర్పడటం వల్ల కుంభ రాశి వారికి మేలు జరుగుతుంది. ఈ యోగం మీ రాశిచక్రం యొక్క రెండవ ఇంట్లో ఏర్పడబోతుంది. దీంతో మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. పెట్టుబడి పెట్టడానికి ఇదే అనుకూల సమయం. మీరు మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. బిజినెస్ లో భారీగా లాభాలు ఉంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook