Benefits of Chaturgrahi Yoga: ప్రస్తుతం దేవగురు బృహస్పతి మేషరాశిలో ఉన్నాడు. గురుడే కాకుండా చంద్రుడు, బుధుడు మరియు రాహువు కూడా అదే రాశిలో సంచరిస్తున్నారు. మేష రాశిలో నాలుగు గ్రహాల కలయిక వల్ల చతుర్గ్రాహీ యోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ యోగం కొన్ని రాశులవారికి చాలా ప్రత్యేకమైన ప్రయోజనాలు అందించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృశ్చిక రాశి
నాలుగు గ్రహాల కలయిక వృశ్చిక రాశివారికి శుభఫలితాలను ఇవ్వనుంది. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. మీరు ఫ్యామిలీతో మంచి సమయాన్ని గడుపుతారు. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. మీ లవ్ సక్సెస్ అవుతుంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది.
కర్కాటక రాశి
చతుర్గ్రాహి యోగం కర్కాటక రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. ఈ యోగం వల్ల మీరు ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం కూడా ఉంది. 


Also Read: Second Surya Grahan 2023: రెండో సూర్యగ్రహణం ఎప్పుడు? ఇది భారతదేశంలో కనిపిస్తుందా?


మీన రాశి
మీనరాశి వారికి ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారులు ఊహించని లాభాలను పొందుతారు. పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉంటాయి. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలపడుతుంది. మెుత్తానికి ఈ సమయం సూపర్ గా ఉంటుంది. 
మకర రాశి
చతుర్గ్రాహి యోగం కారణంగా మీరు శుభవార్తలు వింటారు.  మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఉద్యోగులు స్పెషల్ బెనిఫిట్స్ పొందుతారు. మీ బిజినెస్ విస్తరిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు.


Also Read: Budh Gochar 2023: జూన్‌లో బుధుడి సంచారం.. ఈ 2 రాశులపై ప్రతికూల ప్రభావం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి


IPL newsPBKS Vs RR ScorecardPBKS vs RRPBKS Vs RR Live Updates