Gajkesri Rajyog: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాలు రాశిచక్రాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ శుభ మరియు అశుభ యోగాలను సృష్టిస్తాయి. ప్రస్తుతం దేవగురు బృహస్పతి మీనరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. నవంబరు 4న ఇదే రాశిలోకి చంద్రుడు ప్రవేశించాడు. మీనంలో గురుడు, చంద్రుడి కలయిక వల్ల గజకేరి యోగం ఏర్పడింది. దీని ప్రభావం అన్ని రాశిచక్ర గుర్తులపై కనిపిస్తుంది. అయితే ఈ యోగం (Gajkesri Rajyog) మాత్రం మూడు రాశులవారికి అపారమైన ప్రయోజనాలను అందించనుంది.  ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గజకేసరి యోగం ఈ రాశులకు వరం
మిథునం (Gemini): గజకేసరి యోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మీ సంచార జాతకానికి సంబంధించిన కర్మ ఇంటిపై చంద్రుడు మరియు బృహస్పతి కలయిక జరుగుతుంది. అందువల్ల ఈ సమయంలో మీరు కొత్త జాబ్ పొందే అవకాశం ఉంది. మీరు ఆఫీసులో కొత్త బాధ్యతను తీసుకుంటారు. అంతేకాకుండా ఇదే సమమయంలో మీ సంచార జాతకంలో హన్స్ అనే రాజయోగం కూడా ఏర్పడుతోంది. దీంతో మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. వ్యాపారంలో విజయం సాధిస్తారు. 


కన్య (Virgo): గజకేసరి యోగం మీకు అనేక లాభాలను ఇస్తుంది.  ఎందుకంటే మీ సంచార జాతకం యెుక్క ఏడవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతోంది. మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. వ్యాపారంలో పెద్ద పెద్ద ఆర్డర్ లను పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 


ధనుస్సు (Sagittarius): మీ సంచార జాతకంలో నాల్గవ ఇంట్లో గజకేసరి రాజయోగం ఏర్పడింది. దీంతో మీరు అన్ని భౌతిక ఆనందాలను పొందవచ్చు. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. 


Also Read: Shukra Gochar 2022: వృశ్చిక రాశిలోకి శుక్రుని రాక... ఈ 5 రాశులకు తిరుగులేదు ఇక..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook