Guru Gochar 2023: ఆస్ట్రాలజీలో బృహస్పతిని శుభగ్రహంగా భావిస్తారు. రేపు అంటే ఏప్రిల్ 22న బృహస్పతి మేష రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే అదే రాశిలో సూర్యుడు, బుధుడు, రాహువు మరియు యురేనస్ సంచరిస్తున్నారు. మేషరాశిలో బృహస్పతి సంచారం 5 రాశులవారికి ప్రయోజనకరంగా ఉండనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బృహస్పతి సంచారం ఈ రాశులకు వరం
తుల రాశి: బృహస్పతి రాశి మార్పు తుల రాశి వారికి మేలు చేస్తుంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఈ సమయం బాగుంటుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. 
మీనం: బృహస్పతి సంచారం వల్ల మీనరాశి వారు వ్యాపారంలో భారీగా లాభాలను ఆర్జిస్తారు. మీ కెరీర్‌ దూసుకుపోతుంది. మీ ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి. మీ ఆస్తి రెట్టింపు అవుతుంది. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది. 
మేషరాశి: రేపు ఇదే రాశిలో బృహస్పతి సంచరించబోతున్నాడు. అంతేకాకుండా 5 గ్రహాల కలయిక ఏర్పడింది. దీంతో మీరు కెరీర్ లో మంచి ప్రయోజనాలను పొందనున్నారు. మీ పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త జాబ్ వస్తుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. మీ సమస్యలన్నీ దూరమవుతాయి. 


Also Read: Budh Asta 2023: మరో మూడు రోజుల్లో అస్తమించబోతున్న బుధుడు.. ఈ 3 రాశులకు ప్రతి పనిలో విజయం.. 


సింహ రాశి: బృహస్పతి యొక్క సంచారం సింహ రాశి వారికి కలిసి వస్తుంది. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీరు కెరీర్ లో అపారమైన పురోగతిని సాధిస్తారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. పెద్ద పెద్ద వాళ్ల పరిచయాలు ఏర్పడతాయి. 
కన్య: గురుడు సంచారం వల్ల కన్యా రాశి వారికి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది.మ మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జాబ్ చేసేవారు మరిన్ని అవకాశాలను అందుకుంటారు. మీ హెల్త్ బాగుంటుంది. 


Also Read: Shani Vakri 2023: రివర్స్ లో ప్రయాణించబోతున్న శని గ్రహం.. వచ్చే 139 రోజులు ఈ రాశులకు బాధాకరం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook