Guru vakri In Aries 2023: అష్టగ్రహాల్లో బృహస్పతి కూడా ఒకరు. గ్రహాలన్నింటిలోకెల్లా ఇది అతిపెద్ద గ్రహం. పురాణాల ప్రకారం, ఇతడిని దేవతల గరువుగా భావిస్తారు. విద్య, సంతానం మరియు ఆధ్యాత్మికతకు కారకుడిగా భావిస్తారు. గురుడు మరో మూడు రోజుల తర్వాత అంటే సెప్టెంబరు 04వ తేదీ సాయంత్రం 4.58 గంటలకు మేషరాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. బృహస్పతి డిసెంబర్ 31 వరకు ఇదే స్థితిలో ఉంటాడు. అనంతరం గురుడు నేరుగా నడవడం మెుదలుపెడతాడు. బృహస్పతి తిరోగమనం మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. తిరోగమన గురుడు వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుంభ రాశి
బృహస్పతి రివర్స్ కదలిక కుంభరాశి వారికి లాభాలను ఇస్తుంది. మీ జీతం పెరగడంతోపాటు పదోన్నతి కూడా లభిస్తుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దేనిలోనైనా పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్తత్తగా ఉండండి. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది. 
మేషరాశి
గురుడు తిరోగమనం మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తారు. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల డ్రీమ్ నెరవేరుతుంది. 
ధనుస్సు రాశి
గురు వక్రీ ధనుస్సు రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. జాబ్ చేంజ్ అవ్వడానికి ఇదే మంచి సమయం. మీకు సంతానప్రాప్తి కలిగి అవకాశం ఉంది. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. డబ్బు దుబారా మానుకోండి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఈ సమయంలో పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. 


Also Read: Sun Saturn Rahu Transit 2023: సూర్య, శని, రాహు దుష్ప్రభావంతో సెప్టెంబర్ నెల ఈ రాశులకు ప్రమాదకరం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook