COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Guru-Mangal Yuti 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతి అంగారక గ్రహానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. ఈ రెండు గ్రహాలను ఎంతో శుభప్రదమైన వాటిగా భావిస్తారు. ఈ గ్రహాలు సంచారం చేసినప్పుడల్లా అన్ని రాశుల వారిపై ఎంతో సానుకూలమైన ప్రభావం పడుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో జాతకంలో అశుభ స్థానంలో ఉన్న రాశుల వారికి ప్రతికూల ప్రభావం పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ జులై నెల ఎంతో శుభ్రమైనదిగా భావించవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో కొన్ని ప్రత్యమైన గ్రహాలు సంచారం చేస్తాయి. అలాగే 12 సంవత్సరాల తర్వాత బృహస్పతి, కుజుడు కలయిక కూడా జరిగింది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరికి విపరీమైన లాభాలు కలిగే ఛాన్స్‌ కూడా ఉంది. దీని కారణంగా ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి:
బృహస్పతి, కుజుడు కలయిక కారణంగా మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుతుపున్నారు. ముఖ్యంగా వీరికి డబ్బు పరంగా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఊహించని ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అలాగే పనుల్లో వస్తున్న ఆటంకాలు కూడా సులభంగా తొలగిపోతాయి. వీరికి ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. దీంతో పాటు ఇంట్లో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వ్యక్తిగత జీవితంలో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. వీరికి విపరీతమైన జ్ఞానం కూడా పెరుగుతుంది.


వృషభ రాశి:
వృషభ రాశివారికి కూడా ఈ సమయంలో బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి వ్యక్తిగత జీవితంలో అభివృద్ధి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రమోషన్స్‌పై ఉద్యోగాలు కూడా బదిలీ అవుతాయి. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయంలో చాలా బాగుంటుంది. వీరికి ప్రమోషన్స్ తో పాటు జీతాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. అలాగే వ్యాపారాలు చేసే వారికి కూడా ఈ సమయం ఎంతో బాగుంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. కుటుంబ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి. అలాగే కుటుంబ సభ్యుల నుంచి సపోర్టు లభించి వ్యాపారంలో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. వివాహితులకు ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది పెళ్లి కాని వారు మంచి భాగస్వామిని పొందే ఛాన్స్ కూడా ఉంది.


ధనస్సు రాశి: 
ధనస్సు రాశి వారికి కూడా కుజుడు అంగారక గ్రహ కలయికలతో ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి అత్తమామల నుంచి మంచి సపోర్టు లభించి ఆర్థికంగా విపరీతమైన తన లాభాలు కలుగుతాయి. అలాగే సంపాదన పెరిగి అనుకున్న పనులన్నీ ఎంతో సులభంగా చేయగలుగుతారు. వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు తొలగిపోయి ఆనందం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతోపాటు వీరు కొత్త ఆదాయం వనరులు కూడా పొందుతారు. అలాగే ఆకస్మిక ఆర్థిక లాభాలు పొంది అనుకున్న పనులన్నీ ఎంతో తొందరగా చేయగలుగుతారు. దీంతోపాటు జీవితంలో ఆనందం శ్రేయస్సు కూడా విపరీతంగా పెరుగుతుంది. కెరీర్ కు సంబంధించిన జీవితంలో పురోగతికి కూడా లభిస్తుంది. 


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


తులారాశి: 
ఈ సమయంలో తులా రాశి వారికి కూడా ఎంతో బాగుంటుంది ముఖ్యంగా వృత్తి జీవితం గడుపుతున్న వారికి ఈ సమయంలో అనేక లాభాలు కలుగుతాయి. అలాగే వృత్తి నుంచి వ్యాపారాలు ప్రారంభించే ఛాన్స్ కూడా ఉంది. తులా రాశి నిరుద్యోగ యువకులకు ఈ సమయంలో మంచి కంపెనీల నుంచి ఆఫర్స్ కూడా లభిస్తాయి. అలాగే జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆస్తిపరంగా వస్తున్న కొన్ని చిక్కుల నుంచి విముక్తి కలుగుతుంది. ముఖ్యంగా వీరు కొత్త ఆస్తులను కూడా కొనుగోడు చేసే అవకాశాలున్నాయి. అంతేకాకుండా డబ్బు పరంగా ఈ సమయం చాలా లాపదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ఎలాంటి పనులు ప్రారంభించిన మంచి విజయాలు సాధిస్తారు.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి