Akhand Samrajya Yoga will Impact on Gemini Taurus Cancer zodiac signs: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం... ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో తన స్థానాన్ని మార్చుకుంటుంది. గ్రహం మార్పు లేదా తిరోగమనం మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. ఈ క్రమంలోనే నవంబర్ 24న బృహస్పతి తన రాశిని మార్చబోతోంది. దీని కారణంగా 'అఖండ సామ్రాజ్య యోగం' ఏర్పడుతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి రాశి మార్పుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. బృహస్పతి గ్రహం జ్ఞానం, గురువు, పిల్లలు, విద్య, సంపద, దాన కారకంగా పరిగణించబడుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బృహస్పతి 'అఖండ సామ్రాజ్య యోగం' కొన్ని రాశుల వారికి చాలా అదృష్టంగా మారనుంది. ముఖ్యంగా 3 రాశుల వారు ప్రత్యేక ప్రయోజనాలను పొందబోతున్నారు. బృహస్పతి యొక్క అఖండ సామ్రాజ్య యోగం కారణంగా.. ఈ మూడు రాశుల వారు విశేష ధనాన్ని పొందబోతున్నారు. కోట్ల ఆస్తులకు యజమానులవుతారు. అలాగే కెరీర్‌లో ఎదుగుదలకు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆ మూడు రాశులు ఏవో ఓసారి తెలుసుకుందాం.


కర్కాటకం:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కర్కాటక రాశి చక్ర జాతకంలో తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి సంచరించబోతున్నాడు.ఈ సంచారం విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చదువుపై ఎక్కువ దృష్టి పెట్టడంతో బాగా రాణిస్తారు. పోటీ పరీక్షలలో కూడా విజయం సాధిస్తారు. వ్యాపారులు ఈ కాలంలో పని నిమిత్తం ప్రయాణం చేయవలసి ఉంటుంది. డబ్బు చేతికి అందుతుంది. రాజ అధికారాన్ని పొందే అవకాశం కూడా ఉంది.


వృషభం:
బృహస్పతి సంచారం కారణంగా ఏర్పడే అఖండ సామ్రాజ్య యోగం వృషభ రాశి వారికీ వృత్తి మరియు వ్యాపారాలలో విజయాన్ని ఇస్తుంది. వృషభం రాశిచక్ర పదకొండవ ఇంట్లో బృహస్పతి సంచరించబోతున్నాడు కాబట్టి.. ఈ రాశి వ్యక్తులలో శక్తి, ఆత్మవిశ్వాసం  పెరుగుతుంది. వాహనం మరియు ఆస్తిని కొనుగోలు చేస్తారు. కొత్త ఆదాయ వనరులు సృష్టించబడతాయి. 


మిథునం:
మిథున రాశి వారికి అఖండ సామ్రాజ్య యోగం ప్రయోజనకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దశమ స్థానంలో గురువు సంచరించబోతున్నాడు కావున ఈ వ్యక్తులు ఆశించిన విజయాన్ని అందుకుంటారు. కార్యాలయంలో సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. పిల్లల నుంచి కూడా శుభవార్త అందుతుంది. అడ్మినిస్ట్రేటివ్ మరియు ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసే వ్యక్తులు సానుకూల ఫలితాలుంటాయి. 


Also Read: విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలి.. డిమాండ్ చేస్తున్న ఫాన్స్! మోడీ జీ న్యాయం చేయండి


Also Read: హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త చరిత్ర.. తొలి మహిళా క్రికెటర్‌గా అరుదైన రికార్డు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook