Harmanpreet Kaur become most capped Women's T20I player: టీమిండియా మహిళా కెప్టెన్, స్టార్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. మహిళల ఆసియాకప్ 2022లో భాగంగా శనివారం శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్ ద్వారా హర్మన్‌ప్రీత్ ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. దాంతో న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్ రికార్డును హర్మన్‌ప్రీత్ బద్దలు కొట్టింది.
హర్మన్‌ప్రీత్ కౌర్ ఇప్పటివరకు అంతర్జాతీయ టీ20 కెరీర్లో 137 మ్యాచ్‌లు ఆడింది. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ సుజీ బేట్స్ ఇప్పటివరకు 136 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బరిలోకి దిగడంతో బేట్స్ రికార్డును హర్మన్‌ప్రీత్ అధిగమించింది. ఇంగ్లండ్‌కు ప్లేయర్ డేనియల్ వ్యాట్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. వ్యాట్ టీ20 ఫార్మాట్లో 135 మ్యాచ్‌లు ఆడింది. అలిస్సా హీలీ (132), డియాండ్రా డాటిన్ (127) టాప్ 5లో ఉన్నారు.
హర్మన్‌ప్రీత్ కౌర్ 2009లో భారత్ తరపున టీ20 అరంగేట్రం చేసింది. ఇప్పటివరకు 137 మ్యాచ్‌లలో 122 ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన హర్మన్.. 2683 రన్స్ చేసింది. ఇందులో ఓ సెంచరీ, 8 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో సెంచరీ చేసిన ఏకైక భారత మహిళా క్రికెటర్ కూడా హర్మనే. అయితే సుజీ బేట్స్ 3613 పరుగులు చేయడం గమనార్హం. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది.
🚨 𝗥𝗘𝗖𝗢𝗥𝗗 𝗔𝗟𝗘𝗥𝗧 🚨
1⃣3⃣7⃣ T20Is & going strong! 🙌 🙌
Congratulations to #TeamIndia Captain @ImHarmanpreet as she becomes the Most Capped T20I Player in Women's Cricket. 🔝 👏
Follow the match ▶️ https://t.co/r5q0NTVLQC #AsiaCup2022 | #INDvSL pic.twitter.com/dPcECLVRFy
— BCCI Women (@BCCIWomen) October 15, 2022
మహిళల ఆసియా కప్ 2022 ఛాంపియన్స్‌గా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. శనివారం మధ్యాహ్నం బంగ్లాలోని షెల్లాట్ వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంకను ఓడించి 7వ సారి ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 65 పరుగులు మాత్రమే చేసింది. రేణుకా సింగ్ 3 వికెట్లు పడగొట్టింది. స్వల్ప లక్ష్యాన్ని భారత్ 8.3 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ స్మృతి మందాన (51 నాటౌట్) అర్ధ శతకంతో చెలరేగింది.
Also Read: నేడే టీ20 ప్రపంచకప్ ప్రారంభం.. బరిలోకి 16 జట్లు! మరిన్ని వివరాలు ఇవే
Also Read: Godfather Vs Kantara : చిరంజీవిని దెబ్బ కొట్టేసిన అల్లు అరవింద్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook