Guru Margi 2022 positive effect on zodiac signs: ఆస్ట్రాలజీలో బృహస్పతిని శుభప్రదమైన గ్రహంగా భావిస్తారు. అదృష్టాన్ని పెంచే గ్రహం గురుడు. ప్రస్తుతం బృహస్పతి మీనరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. ఈనెల 24, గురువారం ఉదయం 4.36 గంటలకు గురుడు ప్రత్యక్ష సంచారంలోకి (Guru Margi in Meena Rashi 2022) రానున్నాడు. గురు మార్గం స్థానికుల జీవితంలో డబ్బు, ఉద్యోగం, వివాహ విషయాలలో శుభ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా 5 రాశుల వారికి బృహస్పతి ప్రత్యక్ష సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus): వృషభ రాశి వారికి మార్గి గురువు చాలా శుభప్రదంగా ఉంటాడు. కెరీర్ లో పురోగతితోపాటు అపారమైన ధనాన్ని ఇస్తాడు. ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. మీకు కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. వైవాహిక జీవితం బాగుంటుంది. 
కర్కాటకం (Cancer): బృహస్పతి ప్రత్యక్ష సంచారం కర్కాటక రాశివారి కెరీర్‌లో పురోగతినిస్తుంది. ధన, వృత్తి, వివాహ విషయాలలో వచ్చిన అడ్డంకులు తొలగిపోతాయి. విదేశాలకు వెళ్లవచ్చు. వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూలమైన సమయం. కొత్త పనులు ప్రారంభిస్తారు. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక స్థితి బలపడుతుంది. 


కన్య (Virgo): దేవగురువు బృహస్పతి సంచారంలో మార్పు కన్యారాశి వారికి ధనలాభం కలిగిస్తుంది. వ్యాపారులకు లాభం పెరుగుతుంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు, జీతంలో పెరుగుదల ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది.
వృశ్చికం (Scorpio): నవంబర్ 24 నుంచి వృశ్చికరాశి వారికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. కెరీర్‌లో కొత్త అవకాశాలు వస్తాయి. ఉన్నత పదవి పొందే అవకాశం ఉంది. జీతం పెరుగుతుంది. ఆఫీసులో సహోద్యోగులతో సత్సంబంధాలు మెరుగుపడుతాయి. ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లవచ్చు. మీరు పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు.
కుంభం (Aquarius): మార్గి గురువు మీ కోరికలను నెరవేరుస్తాడు. మీరు అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. మీకు కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. విదేశాల నుంచి జాబ్ ఆఫర్లు రావచ్చు. వ్యాపారంలో అధిక లాభాలు ఉంటాయి. మెుత్తానికి ఈసమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 


Also read: Tulsi plant Tips: తులసి మొక్క మీ ఇంట్లో ఉందా..అయితే ఈ సూచనలు పాటించాల్సిందే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook