Guru Planet Margi 2022: ఆస్ట్రాలజీలో గ్రహాల స్థానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గ్రహాల రాశిచక్రంలో మార్పు ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. బృహస్పతి గ్రహం ప్రస్తుతం మీనరాశిలో తిరోగమనంలో ఉంది. నవంబరు 24న గురుడు మార్గంలోకి (Guru Margi in Pisces 2022) వస్తాడు. జూలై 29న బృహస్పతి మీనరాశిలో తిరోగమనం చెందిన విషయం తెలిసిందే. గురుడు యెుక్క ఈ మార్గం కొన్ని రాశులవారికి ప్రయోజనకరంగా ఉండనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బృహస్పతి సంచారం ఈ రాశులకి ప్రయోజనకరం
వృషభం (Taurus): గురు గ్రహం యెుక్క మార్గి వృషభ రాశి యెుక్క 11 వ ఇంట్లో ఉండబోతుంది. దీంతో ఈరాశివారి ఆదాయం పెరగనుంది. వివిధ వనరుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. వ్యాపారంలో భారీ లాభాలను ఆర్జిస్తారు. ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం. 
మిథునరాశి (Gemini): బృహస్పతి మిథున రాశిలోని పదో ఇంట్లో సంచరించబోతున్నాడు. దీంతో ఈ రాశివారికి మంచి రోజులు ప్రారంభంకానున్నాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు.  వ్యాపారులు కొత్త కొత్త ఆర్డర్లు పొందుతారు. 
కర్కాటకం (Cancer): గురుడు కర్కాటక రాశి యొక్క తొమ్మిదవ ఇంట్లో సంచరించబోతున్నాడు. దీంతో మీకు అదృష్టం కలిసిరానుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. విదేశీ వ్యాపారం చేసేవారు భారీగా లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. 
కుంభం (Aquarius): కుంభరాశి యొక్క రెండో ఇంటిలో బృహస్పతి గ్రహం సంచరించబోతోంది. ఇది ఈ రాశివారిక శుభప్రదంగా ఉంటుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. బోధన, మార్కెటింగ్ మరియు మీడియాతో సంబంధమున్న వ్యక్తులు లాభపడతారు. 


Also Read: Mangal Gochar 2022: అక్టోబరులో మిథునరాశిలోకి కుజుడు... ఈ 5 రాశులవారి కెరీర్ అదుర్స్..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu       


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook