Jupiter And Venus Conjunction In Meen 2023:  వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాలు కాలానుగుణంగా రాశిచక్రాలను మార్చడం ద్వారా పొత్తులు చేసుకుంటాయి. దీని ప్రభావం మానవ జీవితంపై మరియు భూమిపై కనిపిస్తుంది. ప్రస్తుతం బృహస్పతి మీనరాశిలో సంచరిస్తుంది. వచ్చే నెల 15న శుక్రుడు మీనరాశిలోకి వెళతాడు. మీనరాశిలో వీరిద్దరి కలయిక 12 ఏళ్ల తర్వాత జరుగుతుంది. ఈ రెండు గ్రహాల సంయోగం అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో మూడు రాశులవారు భారీగా లాభాలను గడిస్తారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటక రాశిచక్రం
బృహస్పతి మరియు శుక్ర గ్రహాల కలయిక మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.  ఎందుకంటే మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో ఈ కూటమి ఏర్పడబోతోంది. దీని కారణంగా మీకు లక్ కలిసి వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపార నిమిత్తం మీరు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఫ్యామిలీతో సంబంధాలు మెరుగుపడతాయి.


కుంభ రాశి
కుంభ రాశి వారికి బృహస్పతి మరియు శుక్ర గ్రహాల కలయిక అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో రెండవ ఇంట్లో ఈ కూటమి ఏర్పడబోతోంది. దీని కారణంగా మీరు అనుకోకుండా ధనాన్ని పొందుతారు. ఏదైనా పనిని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. వ్యాపారుల భారీగా లాభపడతారు. అప్పుగా ఇచ్చిన  ధనం తిరిగి వస్తుంది. బృహస్పతి ప్రభావం వల్ల పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. 


మిథునం
గురు మరియు శుక్రుల కలయిక మీకు వృత్తి మరియు వ్యాపార పరంగా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ కూటమి మీ సంచార జాతకంలో కర్మ గృహంలో ఏర్పడుతుంది. అందువల్ల ఈ సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. పార్టనర్ షిప్ తో చేసే వ్యాపారంలో భారీగా లాభాలను గడిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆఫీసులో సహచరుల మద్దతు లభిస్తుంది. 


Also Read: Surya Rashi Parivartan: వచ్చే నెలలో రాశిని మార్చనున్న గ్రహాల రాజు... ఈ రాశులకు డబ్బే డబ్బు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook