Guru Uday 2023: `హన్స్ రాజయోగం` చేస్తున్న గురుడు... ఈరాశులకు మంచి రోజులు మెుదలు..
Jupiter Rise 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, ప్రతి గ్రహం నిర్ణీత సమయం తర్వాత ఉదయించడం, అస్తమించడం చేస్తాయి. త్వరలో దేవగురు బృహస్పతి ఉదయించబోతున్నాడు. దీని వల్ల హన్స్ రాజయోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశులవారికి కలిసి వస్తుంది.
Guru Uday 2023 Effects: ప్రతి నెలా గ్రహాలు సంచరిస్తూ, ఉదయిస్తూ, అస్తమిస్తూనే ఉంటాయి. గ్రహాల గమనంలో మార్పు ప్రజలందరిపై కనిపిస్తుంది. ఆస్ట్రాలజీలో దేవగురు బృహస్పతిని శుభగ్రహంగా భావిస్తారు. ఎవరి జాతకంలో గురుడు మంచి స్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. బృహస్పతి ఏప్రిల్ 01 సాయంత్రం మీనరాశిలో అస్తమిస్తాడు. మళ్లీ ఏప్రిల్ 29న మేషరాశిలో ఉదయిస్తాడు. జ్యూపిటర్ ఉదయించడం వల్ల హన్స్ రాజయోగం ఏర్పడుతుంది. జ్యోతిష్యశాస్త్రంలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. హన్స్ యోగం ఏ రాశివారిని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం.
హన్య్ రాజయోగం ఈ రాశులకు శుభప్రదం
కర్కాటక రాశి
బృహస్పతి ఉదయిండం వల్ల ఏర్పడిన హన్స్ రాజయోగం కర్కాటక రాశి వారికి సూపర్ గా ఉంటుంది. వీరు కెరీర్ మరియు వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగం సాధించాలనే కోరిక నెరవేరుతుంది. ప్రతి పనిలో మీ అదృష్టం కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్లాలనే మీ డ్రీమ్ నెరవేరుతుంది.
ధనుస్సు రాశి
హన్స్ రాజయోగం ధనుస్సు రాశి వారికి లాభాలను ఇస్తుంది. మీరు ఆకస్మికంగా డబ్బు పొందుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందుతారు. ఆర్థికంగా మీరు బలపడతారు. మీరు శనిసడేసతి నుండి విముక్తి పొందుతారు. ఈ సమయంలో మీరు ఆస్తి లేదా కారును కొనుగోలు చేసే అవకాశం ఉంది.
మీనరాశి
మీన రాశి వారికి బృహస్పతి ఉదయించడం చాలా శుభప్రదంగా ఉంటుంది. హన్స్ రాజయోగం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. మీరు అద్బుతమైన పురోగతి సాధిస్తారు. లైఫ్ పార్టనర్ మద్దతు లభిస్తుంది. వివిధ మార్గాల ద్వారా మీకు డబ్బు అందుతుంది. వ్యాపారంలో పెద్ద డీల్ కుదర్చుకునే అవకాశం ఉంది. ఈసమయంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
Also Read: Rajyogam: 'లక్ష్మీనారాయణ యోగం' చేస్తున్న బుధుడు-శుక్రుడు.. ఈ రాశులపై కనకవర్షం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.