Hanuman Jayanti 2022: హిందూ పురాణాలు ప్రకారం.. ఏడుగురు చిరంజీవిలలో హనుమంతుడు ఒకరు. మిగిలిన ఆరుగురు చిరంజీవులలో.. అశ్వత్థామ, మహర్షి వేదవ్యాస, విభీషణుడు, బలి, కృపాచార్య,  పరశురాముడు ఉన్నారు. ఈ క్రమంలో కలియుగంలో హనుమంతుని ఆరాధన ఎంతో పుణ్యప్రదమని నమ్ముతారు. ఆంజనేయ స్వామి నామస్మరణతో కష్టాలు దూరమవుతాయని పెద్దలు చెబుతుంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో చైత్ర మాస పౌర్ణమి రోజున హనుమాన్ జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజున హనుమాన్ జయంతిని హిందువులు జరుపుకొంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 16న హనుమాన్ జయంతి రానుంది. ఆ రోజున భక్తులు చేయాల్సిన పూజా నియమాలేంటో తెలుసుకుందాం. 


హనుమంతుని పూజ నియమాలు


మత గ్రంధాల ప్రకారం.. హనుమంతుని పూజలో బూందీ లడ్డూలను ప్రసాదంగా ఉంచాలి. ఆంజనేయ స్వామికి లడ్డూ ఎంతో ప్రీతికరమైనదని భక్తులు నమ్ముతారు. మరోవైపు, హనుమంతుని పూజలో చరణామృతాన్ని ఉపయోగించకూడదు. 


గ్రంథాలలో హనుమంతుడు సంపూర్ణ బ్రహ్మచారి. అటువంటి పరిస్థితిలో ఆయన పూజ చేసే సమయంలో సంపూర్ణ బ్రహ్మచర్యం పాటించాలి. దీనితో పాటు మనం చేసే ఆరాధనలో ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. 


హిందూ మత విశ్వాసాల ప్రకారం.. మంగళవారం, శనివారాలు హనుమంతుని పూజించడానికి ఉత్తమమైన రోజులుగా పరిగణిస్తారు. అంతే కాకుండా ఆ రోజుల్లో హనుమంతుడిని పూజించడం ద్వారా శని కోపం కూడా తొలగిపోతుందని భక్తుల నమ్మకం.


హనుమాన్ జయంతి రోజున పూజ చేసిన వాళ్లు ఎటువంటి మత్తు పదార్థాలు తీసుకోకూడదు. ఇది కాకుండా హనుమాన్ జయంతి రోజున మాంసం, వెల్లుల్లి - చిన్నుల్లిపాయల వినియోగాన్ని కూడా నివారించాలి. 


ఇలా చేస్తే శని దోషం పోతుంది..


ఈసారి హనుమాన్ జయంతి శనివారం వస్తోంది. అటువంటి పరిస్థితిలో శని దోషం నుంచి విముక్తి పొందేందుకు ఆ రోజున హనుమంతుని పూజించాలి. అంతే కాకుండా ఆ రోజున శనిదేవుని ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అలాగే స్తోమత కొద్ది దానాలు చేయాలి. ఇలా చేయడం వల్ల శని దేవుడి పరిస్థితిలో ప్రయోజనం ఉంటుందని నమ్ముతారు.


(నోట్: పైన పేర్కొన్న సమాచారం కొన్ని శాస్త్రాల నుంచి గ్రహించబడింది. దీన్ని పరిగణలోకి తీసుకునే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)  


Also Read: Rahu Ketu Transit: రాహు, కేతువు సంచారం.. ఈ 5 రాశుల వారు పట్టిందల్లా బంగారమే!


Also Read: Hanuman Jayanti 2022: హనుమాన్ జయంతి రోజున ఇలా చేస్తే... ఏ శని మీకు అడ్డుపడలేదు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook