Bhogi 2024 date and Significance: హిందువులు జరుపుకునే ముఖ్య పండుగలలో భోగి కూడా ఒకటి. ఈ ఫెస్టివల్ ను ప్రతి ఏటా జనవరిలో నెలలో సంక్రాంతి ముందు రోజు జరుపుకుంటారు. ఈ పండుగ తెలుగు వారి సంస్కృతికి అద్దపడుతోంది. భోగి మంటలు, హరిదాసు సంకీర్తనలు, కోడి పందాలు, ముగ్గులు పోటీలు, గంగిరెద్దు విన్యాసాలుతో ఈ పండుగ సరికొత్త శోభను సంతరించుకుంది. ఈరోజునే కొత్త అల్లుళ్లు అత్తవారింటికి వస్తారు. ఏపీలో ఈ పండుగ సందడి ఓ రేంజ్ లో ఉంటుంది. 2024లో భోగి పండుగ జనవరి 14న వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భోగి పండుగ ప్రాముఖ్యత
'భగ' అనే పదం నుంచి 'భోగి' పుట్టింది. దక్షిణాయనానికి చివరి రోజుగా భోగి పండుగను భావిస్తారు. ఈ క్రమంలో దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల (bonfire) రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి.. రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖసంతోషాలను ప్రసాదించాలని ప్రజలు కోరుకుంటారు. ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామున లేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. అనంతరం భోగి మంటలు వేసి.. అందులో పిడకలు, ఇంట్లోని పాత వస్తువులు, పాత బట్టలను అగ్నికి అహుతి చేస్తారు. మనలోని చెడును తగలబెట్టి, మంచిని పెంచుకోవడమే ఈ భోగిమంటల ప్రత్యేకత. 


Also read: Sankranti 2024 date: 2024లో సంక్రాంతి ఎప్పుడు వచ్చింది? ఈ పండుగ ప్రాముఖ్యత తెలుసుకోండి..


అంతేకాకుండా భోగి రోజు బొమ్మల కొలువు చేసి...  ముత్తాయిదవులను పిలిచి.. చిన్న పిల్లల మీద రేగుపళ్లు లేదా భోగి పోళ్లు పోయిస్తారు. ఇలా చేయడం వల్ల పిల్లల తలపై ఉండే బ్రహ్మ రంధ్రం ప్రేరేపితమై పిల్లలలు జ్ఞానవంతులు అవుతారని ఓ నమ్మకం.  భోగి రోజున ప్రజలు.. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలుసుకుని ఒకరికొకరు భోగి శుభాకాంక్షలు చెప్పుకుంటారు. 


Also Read: Guru Gochar 2023: న్యూ ఇయర్ కు ముందు ఈ 3 రాశులకు కుబేర యోగం.. ఇందులో మీ రాశి ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.