Sankranti 2024 date and time: తెలుగు లోగిళ్లు జరుపుకునే మెుదటి పండుగ సంక్రాంతి. ఈ సమయంలోనే సూర్యభగవానుడు ధనస్సు రాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే దీనిని మకర సంక్రాంతి అంటారు. పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ ఫెస్టివల్ ను జరుపుకుంటారు. ఈ పండుగను తమిళనాడులో పొంగల్, గుజరాత్ లో 'ఉత్తరాయణం', పంజాబ్ లో లోహ్రి, అసోంలో బిహు, కేరళలో ఓనం అని పిలుస్తారు. ఈ సంవత్సరం ఈ పండుగను జనవరి 15న జరుపుకోనున్నారు. ఈరోజున సూర్యారాధన చేయడం, నువ్వులు తినడం, దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు.
సంక్రాంతి అనేది నాలుగు రోజుల పండుగ. తొలి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ, నాలుగో రోజు ముక్కనుమ జరుపుకుంటారు. ఈ పండుగ సమయంలో పూర్వీకులు పూజించడం, ఇల్లును అలకరించడం, కొత్త బట్టలు వేసుకోవడం, పిల్లలపై భోగి పళ్లు వేయడం, గాలిపటాలు ఎగురవేయడం, కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు వంటివి జరుపుతారు. ఈ పవిత్రమైన రోజు నుంచే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఈరోజు నుంచి వివాహాది శుభ కార్యాలు మళ్లీ మెుదలవుతాయి.
మకర సంక్రాంతి పుణ్యకాలం - 07:15 నుండి 06:21 వరకు
మకర సంక్రాంతి మహా పుణ్యకాలం - 07:15 నుండి 09:06 వరకు
మకరరాశిలో సూర్యుడి ప్రవేశం - తెల్లవారుజామున 2.54 నిమిషాలు
సంక్రాంతి ప్రాముఖ్యత
వేదాలలో మకర సంక్రాంతిని మహాపర్వ అని కూడా అంటారు. మకర సంక్రాంతి రోజున గంగాస్నానం చేయడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. కాబట్టి ఈ రోజున దానధర్మాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ పవిత్రమైన రోజున సూర్యభగవానుడికి ఆర్ఘ్యం సమర్పించడం, దానాలు చేయడం, పూర్వీకులకు శ్రాద్ధ కర్మలు వంటివి ఆచరిస్తారు. ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.
Also Read: Shani Dev Favourite Rashi: శని అనుగ్రహంతో మరో రెండు సంవత్సరాల పాటు ఈ రాశుల వారికి లాభాలే లాభాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook