Holi 2024 date: హిందువుల ముఖ్యమైన పండుగలలో హోలీ ఒకటి. ఈ పండుగను ప్రతి ఏటా ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజు జరుపుకుంటారు. ఈ పండుగను పశ్చిమ బెంగాల్ లో దోల్‌యాత్రా లేదా బసంత-ఉత్సబ్ అని పిలుస్తారు. ఈరోజున నీళ్లను, రంగులను ఒకరిపై ఒకరు చల్లు కుంటారు. హోలీ ముందు రోజున హోలికా దహనం చేస్తారు. హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు. దీనినే చోటీ హోలీ అని పిలుస్తారు. ఈ హోలిగ దహనాన్నే మన తెలుగు రాష్ట్రాల్లో కామ దహనం అని అంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ రంగుల హోలీని జరుపుకుంటారు. దీనికే ధులండి అని పేరు. ఈ ఏడాది హోలీ ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హోలీ శుభ ముహూర్తం 
ఫాల్గుణ మాసం శుక్ల పక్ష పౌర్ణమి తిథి మార్చి 24 ఉదయం 09:54 గంటలకు ప్రారంభమై.. మార్చి 25 మధ్యాహ్నం 12:29 గంటలకు ముగుస్తుంది. మార్చి 24 ఆదివారం హోలికా దహనం, మార్చి 25 న హోలీ జరుపుకుంటారు.


హోలీ దహనం ప్రాముఖ్యత
హోలీ రోజున హోలికాను కాల్చడం మరియు శ్రీ విష్ణువును పూజించడం వల్ల ప్రతి వ్యక్తి జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సును పొందుతారు. పురాణాల ప్రకారం, హిరణ్యకశ్యపుని కుమారుడు ప్రహ్లాదుడు. ఇతడు విష్ణు భక్తుడు. కానీ హిరణ్యకశ్యపుడు శ్రీ హరిని చాలా ద్వేషించాడు. ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్లహ్లాదుడు హరి భక్తిని మానలేదు. దీంతో తన సోదరి హోలికతో కలిసి ప్రహ్లాదుడును చంపాలని పథకాన్ని రచిస్తాడు హిరణ్య కశ్యపుడు. వారి పథకాన్ని శ్రీమహావిష్ణువు తిప్పికొట్టి హోలికను సంహరించి.. ప్రహ్లాదుడిని రక్షిస్తాడు. దానికి గుర్తుగా హోలిక దహనం చేస్తారు.


Also Read: Bhishma Ashtami 2024: భీష్మ అష్టమి ఉపవాసం.. పితృ దోషం నుండి ఉపశమనం.. శుభసమయం తెలుసుకోండి.. 


Also read: Dhan Shakti Rajyog 2024: ఈ రాశులవారి తల రాతలు పూర్తిగా మారబోతున్నాయి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook