Horoscope Today 01 June 2021: ప్రతి ఒక్క రాశికి ఓ ప్రత్యేక లక్షణం ఉంటుంది. శ్రీ ప్లవ నామ సంవత్సరం జూన్ 01వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి
ఈరోజు మీకు కొంచెం ఒత్తిడితో ప్రారంభం అవుతుంది. రాత్రికల్లా సమస్యలు పరిష్కారమవుతాయి. అయితే మీ ఆరోగ్యం మెరుగవుతుంది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. నూతన విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు.


వృషభ రాశి
వృషభ రాశి నేడు కొంచెం సోమరితనంగా ఉంటారు. అయితే పని చేసే ప్రతి ఒక్కరికి విరామం అవసరం, కాబట్టి ఈ రోజు మీరు విశ్రాంతి తీసుకోవలసిన సమయం ఇది. కుటుంబంతో ఎక్కువ సమయం గడపుతారు. ఉన్నత విద్య కోసం విద్యార్థులు ఆలోచిస్తారు. ఖర్చులు అధికం కావడంతో పనులు మధ్యలోనే నిలిచిపోతాయి. వ్యాపారులకు సాధారణ ఫలితాలు.


Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి


మిథున రాశి
మీ సృజనాత్మకత ఈరోజు మరింత మెరుగవుతుంది. మీరు పుట్టిన ప్రాంతాన్ని పునరుద్ధరించాలని భావిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్నేహితులతో కొంత సమయం గడపడం ద్వారా మానసిక ప్రశాంతత దొరుకుతుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.


కర్కాటక రాశి 
వివాహితులు తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు యత్నిస్తారు. 
విద్యార్థులు తమ చదువులపై దృష్టిసారించడానికి పెద్దల మాట వింటారు. మీ పని భారం తగ్గుతుంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.


సింహ రాశి
ఈ రోజు చిన్ననాటి స్నేహితులను కలిసే అవకాశం ఉంది. శుభవార్తలు అందుకుంటారు. చేతికి అందివచ్చిన డబ్బును భూమిపై పెట్టుబడి పెడతారు. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. భార్యాభర్తలు ఏకాంతంగా గడపాలని భావిస్తారు. 


కన్య రాశి
మీ కెరీర్‌ను మార్చుకునేందుకు తొలి అడుగు నేడు పడనుంది. 
పెద్దల ఆశీర్వాదంతో మీకు అంతా మంచే జరుగుతుంది. గతంలో చేసిన పెట్టుబడుల లాభాలు సైతం చేతికొస్తాయి. మీ మాటకారితనం ద్వారా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు ఇంటి నుంచి బయటకు వెళ్లడం క్షేమదాయకం కాదు.


Also Read: Fertility Myths: సంతానలేమిపై మగవారిలో 5 ముఖ్యమైన సందేహాలు, వాటి సమాధానాలు


తులా రాశి
ఈ రోజు నగదుకు సంబంధించిన విషయాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. పెట్టుబడి పెట్టడం తాత్కాలికంగా మానుకోండి. విద్యార్థులు చదువు విషయాలు పక్కనపెట్టి పరధ్యానంలో ఉంటారు. మీ దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టిసారిస్తారు. ఖర్చులు అధికం కావడంతో రుణ యత్నాలు మొదలుపెడతారు. 


వృశ్చిక రాశి
మీ మాటకారితనం, నైపుణ్యం పని పూర్తి చేయడానికి దోహదం చేస్తాయి. సక్సెస్ కోసం మీరు అదనపు ప్రయత్నం చేస్తున్నారని ఉన్నతాధికారులు గమనిస్తారు. ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. 


ధనుస్సు రాశి
మీ వ్యక్తిగత జీవితం కంటే మీ పనిపై ఎక్కువ దృష్టి సారించే అవకాశం ఉంది. బంధువులతో స్వల్ప వివాదాలు తలెత్తుతాయి. వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రయాణాలకు దూరంగా ఉండాలి.


మకర రాశి
మీరు చేసే పని విజయవంతమవుతుంది. అయితే కేవలం పనిలో మునిగిపోవడానికి ప్రయత్నించకండి. ఈ రోజు మీ కుటుంబంతో కొంత సమయం గడపటం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.


Also Read: Lunar Eclipse 2021: చంద్ర గ్రహణం ఈ రాశుల వారిపై ప్రభావం చూపుతుంది


కుంభ రాశి
విద్యార్థులు వారి చదువుపై దృష్టిసారిస్తారు. మరియు పాఠశాలలు మరియు కళాశాలల నుండి శుభవార్త అందుకుంటారు. మీ మనసుకు ప్రశాంతతను కలిగించడానికి నచ్చిన పనులు చేయాలి. పనిలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ఖర్చులు అధికం అవుతాయి. పనులు మధ్యలోనే నిలిచిపోతాయి.


మీన రాశి
సోమరితనం పోగొట్టుకోవడానికి ఉదయం లేదా సాయంత్రం వేళ కాస్త శారీరక శ్రమ చేయాలి. ఏవైనా అనారోగ్య సమస్యలు ఈ రోజు పరిష్కారం అవుతాయి. ఈ రోజు మీ నుండి మరియు టీమ్ నుండి అధిక పని భారం పడుతుంది. కొన్ని శుభవార్తలు చెవిన పడతాయి.  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook