Horoscope Today 12 September 2022: మేషం ( Aries): మిశ్రమకాలం. నూతనంగా తలపెట్టిన కార్యాలు పూర్తిచేసేందుకు ప్రయత్నం చేస్తారు. ఆటంకాలు ఎదురైనా ముందుకు సాగుతారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. కోపాన్ని తగ్గించుకుంటే పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. గోసేవ చేస్తే మంచిది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం (Taurus): నూతన కార్యక్రమాలను చేపడతారు. సమాజంలో మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. అనుకున్న పనులను పూర్తిచేస్తారు. కుటుంబంతో సంతోషంగా గడువుతారు. లక్ష్మీ దేవిని ఆరాదించండి. 


మిథునం (Gemini): ఓ నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. కీలక వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకోండి. ధనవ్యయ సూచన ఉంది. ఎవరితోనూ వాదనలకు దిగకపోవడం మంచిది. ఇష్టదేవత స్తోత్ర పారాయణ చేస్తే మంచిది. 


కర్కాటకం (Cancer): శుభకాలం. మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. ముఖ్య విషయాల్లో మీరే నిర్ణయం తీసుకోండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంచిది.


సింహం (Leo): చేపట్టే పనుల్లో అధిక శ్రమ ఉంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. లేదంటే అధిక ధనవ్యయం తప్పదు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. రామరక్షా స్తోత్రం చదివితే మంచిది.


కన్య (Virgo): ధర్మసిద్ధి ఉంది. ఓ ముఖ్య పనిలో దగ్గరివారి సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్ట దైవారాదన మానవద్దు.


తుల (Libra): శుభకాలం. అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికీ కలిసి రానుంది.  కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. ప్రయాణ సూచన ఉంది. ప్రసన్నాంజనేయ సోత్రం పారాయణ చేయాలి.


వృశ్చికం (Scorpio): చేపట్టిన పనుల్లో ఆలస్యం జరగకుండా చూసుకోవాలి. కుటుంబ బాధ్యతలు అధికమవుతాయి. ప్రతి పనిలో మీ అంచనాలు తప్పుతాయి. ముఖ్య వస్తువులు ఏది కనుగోలు చేయరాదు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆదిత్య హృదయం చదవడం మంచి ఫలితాలనిస్తుంది. 


ధనస్సు (Sagittarius): అన్ని రంగాల వారికీ అనుకూల సమయం. భవిష్యత్ ప్రణాళికలను అమలు చేస్తారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. కుటుంబంతో కలిసి హాయిగా గడుపుతారు. ఆంజనేయ స్వామి సందర్శనం మంచిది. 


మకరం (Capricorn): శుభకాలం. అధికారులు మీకు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ఇంటికి సంబందించి ఓ కీలక నిర్ణయం తీసుకుంటారు. వేంకటేశ్వర స్వామి వారి దర్శనం శుభప్రదం.  


కుంభం (Aquarius): మిశ్రమకాలం నడుస్తోంది. చేపట్టే పనుల్లో అధిక శ్రమ ఉంటుంది. ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. పెద్దల సలహాలు తీసుకోండి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన మంచింది. 


మీనం (Pisces): అన్ని రంగాల వారికీ అనుకూల సమయం. చేపట్టిన పనులు నెరవేరుతాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అధికారుల సహకారం ఉంటుంది. కుటుంబంతో సరదాగా గడుపుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం. 


Also Read: Asia Cup 2022 Winner: ఫైనల్లో పాకిస్తాన్‌ చిత్తు.. ఆసియా 2022 'కింగ్‌' శ్రీలంక!


Also Read: Suncity Ganesh Laddu: బాలాపూర్ లడ్డూని తలదన్నిన సన్‌సిటీ గణపతి లడ్డూ, 60 లక్షల ధర



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook