Horoscope Today 15 April 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఏప్రిల్ 15వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి
ఈ రోజు మీరు ఇతర రోజుల కన్నా అధికంగా మీ పనిని ఆస్వాదిస్తారు. మీరు ఎదుర్కొంటున్న కొన్ని క్లిష్ట సమస్యలను పరిష్కరించడంలో మీ కుటుంబం మీకు సహాయం చేస్తుంది. విద్యార్థులు తమ చదువులపై ఎక్కువ దృష్టిసారిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఖర్చులు భారం కానున్నాయి.


Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!


వృషభ రాశి
కుటుంబ సభ్యుల ఆరోగ్యం కారణంగా మీరు కలత చెందుతారు. మీరు పని చేయడంలో ఈ రోజు చాలా శ్రద్ధ అవసరం. మీ జీవిత భాగస్వామి కూడా బిజీగా ఉన్నందున పిల్లలకు సహాయం అవసరం కావచ్చు. ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవదర్శనాలు చేసుకుంటారు.


మిథున రాశి
ఈ రోజును మిథున రాశి వారు చాలా ఆనందంతో ప్రారంభిస్తారు. పనిలో మీ నిర్ణయాలు త్వరగా తీసుకుంటారు, తద్వారా మీ పని త్వరగా పూర్తవుతుంది. మీరు కొత్త ఆదాయ వనరులను కూడా కనుగొనే అవకాశం ఉంది. మీ పరిసరాలను వీలైనంత శుభ్రంగా ఉంచండి. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు.


కర్కాటక రాశి 
మీరు ఆఫీసు పనులతో తీరిక లేకుండా గడుపుతారు. మానసిక సమస్యలు దూరం కావాలంటే ధ్యానం చేయాలి. మీరు చాలా అలసిపోయి ఉన్నారు. మీ సమస్యలను పరిష్కరించడానికి పెద్దలు మీకు సహాయపడవచ్చు. మీరు పనిచేసే చోట ప్రమోషన్ కూడా పొందవచ్చు. ఉద్యోగులు, వ్యాపారులకు శ్రమకు తగ్గ ఫలితం అందుకుంటారు.


సింహ రాశి
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మీ కొత్త నిర్ణయాలకు కుటుంబం మద్దతు ఇస్తుంది. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది. ఉద్యోగులకు పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. 


Also Read: Kumbh Mela 2021 Photos: ఘనంగా ప్రారంభమైన హరిద్వార్ కుంభమేళా, ఫొటో గ్యాలరీ


కన్య రాశి
ఈ రోజు మీకు అసంతృప్తిగా అనిపించవచ్చు. ఇది మీ పని తీరును ప్రభావితం చేస్తుంది. మీ జీవితంలో మంచి విషయాలపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. ప్రేమికులకు విచిత్రకరమైన పరిస్థితులు ఎదురుకానున్నాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు తలెత్తుతాయి. ప్రయాణాల కారణంగా ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి.


తులా రాశి
ఈరోజు తులా రాశి వారికి చాలా అనుకూల ఫలితాలు రానున్నాయి. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, ఈ రోజు శ్రీకారం చుట్టాలి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. శ్రమ పెరిగినా ఫలితాలు మాత్రం అంతంతమాత్రంగానే వస్తాయి. ఖర్చులు పెరగడంతో రుణాలు తీసుకుంటారు. 


వృశ్చిక రాశి
ఈ రోజు మీకు మీ యజమానితో మంచి బంధం ఉంటుంది. మీకు పనిలో కొత్త బాధ్యతలను కూడా అప్పగించే అవకాశం ఉంది. మీ కుటుంబంలోని ఒకరితో ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. తోబుట్టువులకు గొడవ ఉండవచ్చు కానీ అది త్వరగా పరిష్కారం అవుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.


ధనుస్సు రాశి
వ్యక్తిగత జీవితం ఈరోజు మీకు సవాలుగా మారవచ్చు. మీరు మరియు మీ జీవిత భాగస్వామి చాలా విషయాలపై విభేదిస్తారు. అదే సమయంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ మాట వింటారు మరియు మిమ్మల్ని గౌరవిస్తారు. చేతికి నగదు అందుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు.


మకర రాశి
మీరు గత కొన్నిరోజులుగా చేస్తున్న పనికి తగిన క్రెడిట్ మీకు రాకపోవచ్చు. ఇది మీకు కోపం తెప్పిస్తుంది. మీ స్నేహితులు మిమ్మల్ని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తారు. మానసిక ప్రశాంతత కోసం ఈ రోజు ధ్యానం తప్పనిసరి. తోబుట్టువులకు మీరు కొంత ధన సహాయం చేయనున్నారు.


కుంభ రాశి
ఈ రోజు వ్యాపారంలో కొంచెం ఒత్తిడి ఎదుర్కోనున్నారు. కనుక ఖర్చులను చాలా తక్కువగా చేయడం ద్వారా మీకు పరిష్కారం దొరుకుతుంది. ఇంట్లో వారు మీ మాట వినకపోవడంతో మీరు ఓపికపట్టాలి. కొంతమంది కొత్త వ్యక్తులు పనిలో మీ భాగస్వాములు అవుతారు. మీపై పని బారం కాస్త తగ్గనుంది.


మీన రాశి
ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కానీ నేడు మీరు పనులతో తీరిక లేకుండా గడుపుతారు. కనుక మీరు ఇతరుల సహాయం కోరవలసి ఉంటుంది. మీ కోసం ఏదైనా కొనడానికి కొంత డబ్బు ఖర్చు చేయండి. చేపట్టిన పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూల ఫలితాలు వస్తాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook