Horoscope Today 16 March 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 16న సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేష రాశి
ఈ రోజు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఇది మీ నిర్ణయాలను ప్రశ్నిస్తుంది. మీరు ఈ ఆలోచనల ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు పెరుగుతాయి. మితిమీరిన వ్యయంతో ఆందోళన మొదలవుతుంది.


Also Read: Vastu Tips: రాత్రివేళ హాయిగా నిద్రించాలంటే Pillow కింద ఉంచాల్సిన వస్తువులు ఇవే


వృషభ రాశి
మీ అంచనాలు కొన్నిసార్లు నిరాశకు దారితీయవచ్చు, కాబట్టి మీరు ఎవరి నుండి ఏమీ ఆశించకపోవడమే మంచిది. మీ లక్ష్యాలకు, మీ ఆలోచనలకు మాత్రమే కట్టుబడి ఉండండి. మీ నిర్ణయాలకు కట్టుబడి పని చేస్తే విజయం తథ్యం. నేడు మీకు ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలు ఓ కొలిక్కి రానున్నాయి.


మిథున రాశి
మీ మనసు ఏమి చెబుతుందో దానిపై శ్రద్ధ చూపుతారు. ఇతరుల సహాయం కోసం వేచిచూడకుండా మీరే స్వయంగా పని ప్రారంభించాలి.  ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. ఇతరుల నుండి అభిప్రాయాలను తీసుకునే బదులు, మీ మనసు ఏం చెబుతుందో అది తెలుసుకోండి. శుభకార్యాలకు యత్నాలు మొదలవుతాయి.


కర్కాటక రాశి
మీ మీద మీరు నమ్మకం ఉంచాలి. అయితే నిర్ణయం తీసుకునే ముందు ఇతరులు ధ్రువీకరించాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మీ వెనుక మరికొందరు నడుస్తారు. అసత్యాల వల్ల ఇబ్బందులు తప్పవని గ్రహిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అనారోగ్య సమస్య నేడు మిమ్మల్ని బాధిస్తుంది.


సింహ రాశి
ఈరోజు మీ దినచర్యలో మార్పు రాబోతోంది. దీనివల్ల మీ పని భారం పెరిగే అవకాశం ఉంది. అయితే, దీన్ని మీకు సానుకూలంగా మార్చుకుంటారు. పనిచేసే చోట మీ ఉన్నతాధికారులు మీపై నమ్మకం ఉంచుతారు. సుదీర్ఘకాలం నుంచి వాయిదా వేసిన పనులను పూర్తి చేయనున్నారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించనుంది. వ్యాపారులకు సైతం లాభసాటిగా ఉండనుంది.


కన్య రాశి
ఈ రోజు మీకు నచ్చిన పనులు చేస్తూ సరదాగా సమయం గడుపుతారు. తద్వారా మీకు ఆదాయాన్ని తెచ్చే వేరే పనిలో అవకాశం సైతం మీ తలుపు తట్టనుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. వివాదాలకు దూరంగా ఉండటం వల్ల మీకు మేలు జరగనుంది.


తులా రాశి
కొన్ని అంశాలను మార్చాలని ఈరోజు మీరు బలంగా కోరుకుంటారు. మీ పని మరియు నివాస స్థలాన్ని మార్చాలని కోరుకుంటారు. మీరు పనిలో ఎక్కువ సమయం గడిపినట్లయితే, మీ వర్క్ డెస్క్‌ను మరింత సౌకర్యవంతంగా మరియు ప్రభావవంతంగా మార్చడానికి దాన్ని పునరుద్ధరించాలి. కుటుంబ పరిస్థితుల కారణంగా మానసిక ఆందోళనకు గురవుతారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా రుణాలు చేయాల్సి వస్తుంది.


వృశ్చిక రాశి
ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకునే ముందు ఇరు వైపులా వాదనలు వినాలి. లేని పక్షంలో మీరు నిర్ణయం ఒకరికి అన్యాయం చేస్తుంది. నిర్ణయం నిర్ణయం తీసుకునేటప్పుడు న్యాయంగా, గౌరవంగా ఉండండి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.


ధనుస్సు రాశి
పనికి దూరంగా ఉండేలా చేసేందుకు పలు విషయాలు మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి. చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల పరధ్యానంలో పడకుండా, అన్ని అంశాలపై దృష్టి పెట్టడం శ్రేయస్కరం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కొందరు యత్నిస్తారు. అయితే మీరు చేస్తున్న పనిని కొనసాగించండి. కొందరికి ధననష్టం గోచరిస్తుంది. గొడవలు, వివాదాలకు దూరంగా ఉండకపోతే మానసిక ఆందోళన పెరుగుతుంది.


మకర రాశి
గతాన్ని మరిచిపోవాల్సిన సమయం ఇది. భవిష్యత్ కోసం ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగడం ఉత్తమమైన నిర్ణయం. నూతన వస్తువులను కొనడానికి సమయం ఆసన్నమైంది. మీ ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. దాంతో మీకు కావాల్సినవి కొనుగోలు చేస్తారు. కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. 


Also Read: EPFO: ఖాతాదారులు కంపెనీ మారుతున్నారా, ఇకనుంచీ EPF Transfer తలనొప్పి ఉండదు


కుంభ రాశి
మీరు ఊహించని సంఘటనలు జరుగుతాయి. అయితే ఆశ్చర్యం నుంచి తేరుకుని, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. మీ దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టి, ఆ దిశగా పనిచేయండి. ప్రయాణాలు, శుభకార్యాల కారణంగా ధన వ్యయం గోచరిస్తుంది. రుణాల కోసం యత్నాలు మొదలవుతాయి.


మీన రాశి
ఈరోజు మీ చేతికి వచ్చిన దానితో సంతోషంగా ఉండండి. అంతకుమించి కావాలని ఆశించరాదని గ్రహిస్తారు. దీని వల్ల అంతా మేలు జరుగుతుంది. స్థిరాస్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది. అయితే ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదు. కొన్ని ప్రయాణాలు లాభాన్ని చేకూరుస్తాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook